అఖిల్ సినిమాలో ప్రముఖ హీరోయిన్.. నాగ్ కు నచ్చేసింది...
అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అఖిల్ ఈ మధ్య హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అఖిల్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికీ హలో పరువాలేదు అనిపించింది. తాజాగా ఈ హీరో వెంకి అట్లురితో సినిమా చెయ్యడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మధ్య సినిమాను అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం చేసారు.

కింగ్ నాగార్జునకు నచ్చింది...
వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమాను తీసి మంచి విజయం సాధించిన వెంకి అట్లూరి చెప్పిన పాయింట్ నాగార్జునకు విపతీరంగా నచ్చడంతో ఈ కథను ఓకేచెయ్యడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

కీలక పాత్రలో టాప్ హీరోయిన్..
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో తమన్నా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతునట్లు తెలుస్తోంది. సినిమాలో కీలకంగా ఉన్న ఈ పాత్ర తమన్నా చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో తమన్నా పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బిజీ బిజీగా తమన్నా..
తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు వెంకటేష్ సరసన ఎఫ్2లో అలాగే సైరా, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల్లో నటించబోతోంది. బాహుబలి సినిమా తరువాత తమన్నా వరుస సినిమాలతో బిజీ కావడం విశేషం.

హీరోయిన్ గా మెఘా అకాష్...
త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో మేఘా అకాష్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ హీరోయిన్ అఖిల్ రెండో సినిమా చెయ్యాలి, కాని ఆ సమయంలో కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చెయ్యలేక పోయింది. మెఘా అకాష్ తో పాటు మరో హీరోయిన్ ఈ సినిమాలో నటించబోతోంది. ఆ వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











