»   » మహేష్, రామ్ చరణ్‌తో పాటు బరిలోకి బాలయ్య

మహేష్, రామ్ చరణ్‌తో పాటు బరిలోకి బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సత్య దేవ్ దర్శకత్వంలో ‘లయన్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య 98వ చిత్రం. దీని తర్వాత బాలయ్య చేయబోయే 99వ చిత్రం ‘డిక్టేటర్'. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. ‘లయన్' చిత్రం పూర్తయిన వెంటనే కొంత గ్యాప్ తీసుకుని సినిమా ప్రారంభం కానుంది.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్ నిర్మించబోతోంది. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీవాస్ స్ర్కిప్టు ప్రిపరేషన్లో ఉన్నాడు. ఈ చిత్రాన్ని దసర నాటికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగిన విధంగా షెడ్యూల్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. దసర సీజన్లో మహేష్ బాబు- శ్రీకాంత్ అడ్డాల మూవీతో పాటు రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీ కూడా దసర సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 Tough competition between Balakrishna, Mahesh, Charan

ఈ మూడు సినిమాలు దసరాకే విడుదలయితే పోటీ రసవత్తరంగా మారనుంది. బరిలో ముగ్గురు బడా హీరో ఉంటే బాక్సాఫీసు షేక్ అవ్వడం ఖాయం. అయితే గెలుపు ఎవరిని వరిస్తుంది అనేదే అసలు పాయింట్. ఇవన్నీ తేలాలంటే దసరా పండగ వరకు ఆగాల్సిందే డూడ్స్.

English summary
If everything goes according to the plan, actor turned politician Nandamuri balakrishna will be fighting it out with Superstar Mahesh Babu and Megapower Star Ram Charan during this Dasara season.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu