»   » కొణిదల నీహారిక 'ముద్దపప్పు ఆవకాయ్‌' ట్రైలర్‌ (వీడియో)

కొణిదల నీహారిక 'ముద్దపప్పు ఆవకాయ్‌' ట్రైలర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పింక్‌ ఎలిఫెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ 'ముద్దపప్పు ఆవకాయ'. ఈ సిరీస్‌ ట్రైలర్‌ను గురువారం రాత్రి నటుడు నాగబాబు విడుదల చేశారు. ఆయన కుమార్తె నిహారిక నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.

'ఏ ఫర్‌ ఆశ, ఏ ఫర్‌ అర్జున్‌'. 'ఆశ ఎవరు?, అర్జున్‌ ఎవరు?' అంటూ వినూత్నంగా ప్రముఖ సినీ తారల కాజల్‌, మంచు లక్ష్మి, నాని, సాయిధరమ్‌తేజ్‌, సందీప్‌ కిషన్‌ తదితరుల ద్వారా ఆసక్తికరంగా రూపొందించిన ప్రొమో వీడియోలు ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠని రేకెత్తించాయి. తొలిసారిగా యూట్యూబ్‌ ద్వారా విడుదల చేయబోతున్నందున ప్రేక్షకులు ఏమాత్రం ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

‘ముద్దపప్పు ఆవకాయ'లో నిహారిక ఆశా పాత్రలో మెయిల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర అర్జున్ పాత్రలో మరొక వ్యక్తి నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

అమృతం సీరియల్ తరహాలో ‘ముద్ద పప్పు ఆవకాయ' అనేది ఎంటర్టెన్మెంట్ సిరీస్ అని తెలుస్తోంది. ఎపిసోడ్లుగా ఎంటర్టెన్మెంట్ పంచే విధంగా దీన్ని డిజైన్ చేనట్లు తెలుస్తోంది. త్వరలో నిహారిక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనుంది. అయితే ఇందులో అర్జున్, ఆశా అనే రెండు క్యారెక్టర్లు కీలకంగా ఉండనున్నాయని స్పష్టమవుతోంది.

English summary
Konidala Niharika launched a production of her own with the name 'Pink Elephant Pictures'. On this banner, She begun a Youtube series titled as 'Muddapappu Avakai'. The first look and the trailer has been unveiled on Thursday by Nagababu on the eve of Mega Brother's birthday.
Please Wait while comments are loading...