»   » చాలాసేపు హ్యాంగోవర్‌లోనే ఉండేదాన్ని...ఇలియానా

చాలాసేపు హ్యాంగోవర్‌లోనే ఉండేదాన్ని...ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటి వరకూ నేను చేసిన పాత్రల్లో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన పాత్ర మాత్రం 'రాఖీ'లోని 'త్రిపుర' పాత్రే. కృష్ణవంశీ పేకప్‌ చెప్పిన తర్వాత కూడా..కొన్ని గంటల పాటు ఆ హ్యాంగోవర్‌లోనే ఉండేదాన్ని. మళ్లీ అలాంటి పాత్ర ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను' అంటోంది ఇలియానా. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రం చేస్తోంది. ఈ సందర్భంగా మీడియోతో మాట్లాడుతూ ఎన్టీఆర్ సరసన తాను చేసిన రాఖీ చిత్రం గుర్తు చేసుకుంది. అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ...నా కెరీర్‌ కాస్తంత మందగించిందని రకరకాల వార్తలు ఈ మధ్య చదివాను విన్నాను.వాటిని చూసి నవ్వుకున్నా. ప్రస్తుతం నేను చేస్తున్న, చేయబోతున్న సినిమాలన్నీ నా స్థాయికి తగ్గ సినిమాలే. నటిగా నన్ను నేను నిరూపించుకునే మంచి పాత్రలు చేయాలని ఉంది. అలాంటి పాత్రలు దొరికితే మాత్రం వదులుకోను' అంది ఇలియానా. పవన్‌ కళ్యాణ్, జయంత్‌ కాంబినేషన్ ‌లో నటుడు గణేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రంలోనూ కూడా ఇలియానానే హీరోయిన్ గా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu