»   » త్రిష సినిమాతో హీరోగా తెలుగు కమెడియన్ ఎంట్రీ

త్రిష సినిమాతో హీరోగా తెలుగు కమెడియన్ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో కమెడియన్లుగా రాణించిన కొందరు స్టార్లు హీరోగా కూడా అవకాశాలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. అలీ, బ్రహ్మానందం లాంటి వారు కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్ని హీరోగా కూడా కొన్ని హిట్లు ఇచ్చారు. తెలుగులో స్టార్ కమెడియన్ గా వెలుగొందిన సునీల్... ఇపుడు పూర్థిగా హీరో పాత్రలు చేస్తూ దూసుకెలుతున్నాడు.

మరికొందరు కమెడియన్లు కూడా అవకాశం వస్తే హీరోగా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తెలుగు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల విడులైన ‘గీతాంజలి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇదే బాటలో మరో కమెడియన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Trisha to act with a Comedian Rajesh

సత్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ రాజేష్ త్వరలో త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తమిళం, తెలుగు ద్విబాషా చిత్రం ‘నాయకి' చిత్రం ద్వారా ఎంటీగా ఎంట్రీ ఇస్తున్నాడు. గోవర్దన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్నాడు రాజేష్.

హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్ సరసన సుష్మా రాజ్ నటిస్తోంది. త్రిష సరసన వెంట్రామన్ నటిస్తున్నాడు. హత్యకు గురై దెయ్యంగా మారిన మహిళ గురించి సినిమా సాగుతుంది. 1980 నాటి కథతో సినిమా సాగుతుంది. ఈ చిత్రాన్ని రాజ్ కందుకూరి, గిరిధర్ నిర్మిస్తున్నారు. తెలుగు తమిళంలో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Sources informed that Comedian Satyam Rajesh who rose to fame with movies like 'Satyam', 'Geetanjali', 'Deshamuduru' & 'Neninthe' has bagged the hero role in 'Nayaki'. Sushma Raj will be paired opposite Rajesh who is a known face to Telugu audience by director Neelakanta’s 'Maya'.
Please Wait while comments are loading...