»   » త్రిష హంగామా అంతా ‘పేటా’ కోసమేనా....?

త్రిష హంగామా అంతా ‘పేటా’ కోసమేనా....?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటీమణులు పారితోషికం తీసుకున్న తర్వాత ఎలా నటించమంటే అలా నటించక తప్పదు. అదే పని చేస్తోంది త్రిష. అయితే చిత్రాల్లో నటిస్తే దానినెవరూ పట్టించుకోరు. ఈ మధ్య యాడ్స్‌ లో కూడా నటిస్తోంది. ఈ విషయాలన్నింటినీ పక్కకు పడేసి త్రిష సరికొత్త రికార్డు సృష్టించింది. బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్నంత మాత్రాన ఆ పాత్రలో జీవించాలని అనుకుందే ఏమో? ప్రస్తుతం అదే పని చేస్తోంది. వీధి కుక్కలపై ఎనలేని ప్రేమ కురిపిస్తోందట త్రిష. పెంపుడు జంతువులంటేనే అసహ్యించుకునే అమ్మడు ఇలా చేస్తుందేమిటబ్బా అని ఆరా తీస్తే...ఓ విషయం బయటపడింది.

అదేంటంటే ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి జంతు సంరక్షణ కోసం కృషి చేసే 'పెటా"(పీపుల్ ఎథ్నిక్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) అనే స్వచ్చంద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఈ మధ్య ఎంపికైందట త్రిష. సో ఇందులో ఆల్రెడీ అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహామ్ వంటి బిగ్ స్టార్స్ మెంబర్స్ గా ఉండటం విశేషం. ఇంకేముంది? వెంటనే హంగామా మొదలుపెట్టేసిందట. ఏది ఎలా ఉన్నా ప్రజలందరూ తలొక వీధి కుక్కను దత్తత తీసుకోమంటోందిట. ఇప్పటికే కుక్కల బారిన పడి ప్రజలు రేబిస్ వ్యాధితో బాధపడుతుంటే ఈ జంతు ప్రేమికురాలు సరికొత్త నటనను ప్రదర్శిస్తోంది. ఈ నటనను చూసి 'పెటా" సంస్థ ఓకే అన్నా, ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నార్ట, ఆ లెవెల్‌ లో ఉంది అమ్మడి నటన..! అని.

English summary
The international organization for saving animals worldwide, People for Ethnic Treatment of Animals (PETA), has reportedly chosen reigning Kollywood queen bee Trisha as their ‘brand ambassador’ to send their message across that animals are to be patronized and not tortured.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu