»   » భయంగా..భయంగా...! మోహిని కథ ఇంత భయంకరంగా ఉందా..??

భయంగా..భయంగా...! మోహిని కథ ఇంత భయంకరంగా ఉందా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ హీరోయిన్ స్టేటస్ ని ఎంజాయ్ చేసిన త్రిష..ప్రేమకథలు, కుటుంబ చిత్రాల్లో నటించి బోరుకొట్టేసిందేమో తెలీదుగానీ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా వరుసగా హర్రర్‌ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది దక్షిణాది బ్యూటీ త్రిష. 'అరణ్మనై'లో తొలిసారి దెయ్యంగా కనిపించిన త్రిష హర్రర్‌ కామెడీ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న 'నాయకి'లో లీడ్‌రోల్‌ పోషించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా మరో హర్రర్‌ చిత్రానికి ఓకే చెప్పింది.

మోహినీ పేరుతో వస్తున్న ఈ సినిమా త్రిష కెరీర్ లోనే ఒక డిఫరెంట్ సినిమాగా నిలిచిపోనుందట... అసలు ఈ సినిమా స్టోరీ వింటేనే ఆసక్తి కలగటం ఖాయం. మరి తెర మీద ఇదే రేంజ్ లో ఉంటుందో ఉండదో గానీ ఇప్పటికైతే వినిపిస్తున్న లైన్ చాలా ఇంట్రస్టింగ్ గాఉంది... ఇంతకీ ఆ కథ ఏమిటంటే....

 కొన్నాళ్ళ క్రితమే :

కొన్నాళ్ళ క్రితమే :


ప్రిన్స్ పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రమే 'మోహిని'. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.మాదేష్‌ దర్శకత్వం వహించాడు. ఈ నేపథ్యంలోనే టీమ్ కొన్నాళ్ళ క్రితమే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఆ 'జగన్మోహిని'తో ఈ త్రిష 'మోహిని'ని ఎంతవరకు పోల్చవచ్చోగానీ, త్రిష చేతులో కత్తుల్ని చూస్తోంటే మాత్రం, ఎక్కడో తేడా కొట్టేస్తోంది.

 సినిమా పక్కా హిట్:

సినిమా పక్కా హిట్:


తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న 'మోహిని' సినిమాని హిందీలోకీ డబ్‌ చేసే ఆలోచనలైతే జరుగుతున్నాయట. ఇక, ఈ సినిమాని త్రిష పర్సనల్‌గా తీసుకుందనీ, ప్రమోషన్‌ బాధ్యతల్ని తన భుజాన వేసుకుందనీ తెలుస్తోంది. సినిమా పక్కా హిట్ అన్న నమ్మకం తోనే త్రిష మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతోందట

 ఫామ్ లోకి వచ్చేసింది:

ఫామ్ లోకి వచ్చేసింది:


'నాయకి' సినిమా ప్రమోషన్‌ కోసం త్రిష అస్సలు సహకరించలేదన్న విమర్శలున్నాయి. మరి, 'మోహిని' విషయంలో త్రిష ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. చేతిలో అరడజన్ కి పైగా సినిమాలతో రచ్చ రచ్చ చేసేస్తోంది. మధ్యలో ఈ అమ్మడు ఫిమేల్ ఓరియెంటెడ్ పిక్చర్స్ కూడా ట్రై చేసింది.

 మోహినీ స్టోరీ ఏమిటీఫ

మోహినీ స్టోరీ ఏమిటీఫ


హారర్ కామెడీ జోనర్ కి క్రేజ్ పెరగడంతో.. ఆ జోనర్ లో వరుసగా మూవీస్ ఒప్పుకుంది త్రిష. ఇప్పటికే నాయకి అంటూ ఓ సారి భయపెట్టేందుకు ట్రై చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు.అందుకే ఇప్పుడు మరింత గా భయపెట్టేందుకు సిద్దమైపోయింది... మోహి అవతారం లోకి మారిన త్రిష కొత్తగా తనని తానే భయపెట్టుకునే పాత్రలో కనిపించ బోతోంది. ఔను భయపడేదీ త్రిష నే.., భయపెట్టేది కూడా త్రిష నే... ఇంతకీ మోహినీ స్టోరీ ఏమిటీ అంటే....

 దెయ్యం :

దెయ్యం :


వృత్తి రీత్యా చెఫ్ అయిన త్రిష లండన్ లోని ఒక హొటల్ లో చెఫ్ గా జాయిన్ అవుతుంది. అక్కడి నుంచీ ఆమెను ఓ దెయ్యం వెంటాడి వేధిస్తూ ఉంటుంది. ఆ దెయ్యం త్రిషను తెగ టార్చర్ పెడుతూ ఉంటుంది. త్రిష పాత్రను రకరకాలుగా టార్చర్ చేస్తూనే ఉంటుంది ఆ దెయ్యం . ఇంతకీ అసలు విశేషం ఏంటంటే.. త్రిష రోల్ ను వెంటాడే దెయ్యం రోల్ చేసింది కూడా త్రిషనే .

 సైకలాజికల్ డ్రామా:

సైకలాజికల్ డ్రామా:


ఆఫ్ స్క్రీన్ వినిపించే మాటలేమిటీ అంటే ఇదో సైకలాజికల్ డ్రామా గా నడుస్తూనే హర్రర్ గా కనిపించే కథ. లండన్, థాయ్‌ల్యాండ్‌లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తైందట.వెస్ట్రన్ అవతారంలోని అమ్మవారిలా మోహిని ఫస్ట్‌లుక్ డిజైన్ చేశారు.

 సెమీ న్యూడ్ సీన్లు:

సెమీ న్యూడ్ సీన్లు:


మోహిని చిత్రంలో ఈ అమ్మడు దాదాపు న్యూడ్ గా కొన్ని సీన్లలో కనిపించనుందట. ఫ్యాంటసీ తరహ లో రూపొందబోయే ఈ చిత్రంలో త్రిష అలా నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. సెమీ న్యూడ్ సీన్లు అనగానే కుర్రకారు కళ్లు అప్పగించి చూడటం ఖాయం.

 త్రిష వర్సెస్ త్రిష:

త్రిష వర్సెస్ త్రిష:


దెయ్యం గా భాద పెడుతున్న ఆ రెండో త్రిష ఎవరు? అసలు ఈ చెఫ్ ని ఇంతగా వేధించటానికి కారణం ఏమిటీ... ఇద్దరూ ఒకే లా ఎందుకున్నారూ అన్నదే కథ... త్రిష వర్సెస్ త్రిష వచ్చే సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయట. తన కెరీర్ లోనే అద్బుతంగా చేసిన పర్ఫార్మెన్స్ ఇదే అంటున్నారు మూవీ యూనిట్. దాదాపు లండన్ లోనే మూవీ మొత్తం షూటింగ్ జరపగా.. త్వరలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నామని చెప్పాడు దర్శకుడు మాదేష్.

English summary
According to a Times of India report, she has apparently undergone training from a few cooking experts in London to bring authenticity to her character.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu