»   » హాట్ స్టార్ త్రిష పెళ్ళి కబుర్లు...

హాట్ స్టార్ త్రిష పెళ్ళి కబుర్లు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రిష తన పెళ్లి గురించి ఈ మధ్య బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ...ఇప్పుడప్పుడే తన పెళ్లికి తొందర లేదని,అటువంటి ప్లాన్స్ లేవని కన్పర్మ్ చేసింది. అలాగే ఆమె తల్లి సంభందాలు చూస్తోంది అన్న విషయాన్ని కూడా ఆమె కొట్టిపారేస్తూ...నాకు తెలియకుండా నా పెళ్ళి విషయంలో ఎవరూ ఏ నిర్ణయం తీసుకోరు. అలాగే ప్రస్తుతం నేను ప్రియదర్శన్ దర్శకత్వంలో చేస్తున్న కట్టా-మీటా చిత్రంలో బిజీగా ఉన్నాను. మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ఫైనల్ అయ్యే దిశలో ఉన్నాయి. అయినా సినిమాలు తనివితీరా చేసి పూర్తి స్ధాయిలో తృప్తి పొందాను అనుకున్నాకే పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఆ రోజు ఏ 2015కో వస్తుంది. ఈ లోగా మనస్సు మార్చుకుని మనవు ఆడాలనుకుంటే మొదట మీడియాకే తెలియచేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu