»   »  చెన్నై రైనోస్ అంబాసిడర్‌గా త్రిష

చెన్నై రైనోస్ అంబాసిడర్‌గా త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సెలిబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) చెన్నై రైనోస్ ఫ్రాంచైజీకి బ్రాండ్ అంబాసిడర్‌గా అందాల నటి త్రిష ఎంపికైంది. నాలుగో సీజన్ సిసిఎల్ టోర్నమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా త్రిషను ఎంపిక చేశామని జట్టు యాజమాన్యం గురువారం ప్రకటించింది.

Trisha Krishnan

త్రిష చెన్నైకి చెందిన నటి కావడంతో, ఆమె రాక తమ జట్టుకు మరింత ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందని చెన్నై రైనోస్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని ఆమె ఇటీవలే చేసుకున్నారు.

త్రిష ప్రస్తుతం ఎండ్రేంద్రుమ్ పున్నగాయ్ అనే రోమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది పోటీలు చెన్నై, పూణే, హైదరాబద్, బెంగుళూర్, దుబాయ్‌లో జరుగుతాయి.

ఇప్పటి దాకా జరిగిన సీసీఎల్ మూడు ఎడిషన్లలో మొదటి రెండు సార్లు చెన్నై రైనోస్ గెలుపొందగా, మూడోసారి కర్ణాటక బుల్ డోజర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

English summary
Actress Trisha Krishnan, who is gearing up for her romantic-comedy movie Endrendrum Punnagai, is the new brand ambassador of Chennai Rhinos in the forthcoming Celebrity Cricket League (CCL). She has sealed the deal with the team recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu