»   » బాలయ్య-త్రిష కాంట్రవర్సీకి తెరపడింది...ఇదిగో సాక్ష్యం (ఫోటో)

బాలయ్య-త్రిష కాంట్రవర్సీకి తెరపడింది...ఇదిగో సాక్ష్యం (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య, త్రిష మధ్య ఏదో కాంట్రవర్సీ ఉన్నట్లు ఇటీవల కొన్ని పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. లయన్ ప్రమోషన్లో పాల్గొనని కారణంగా త్రిషపై బాలయ్య కోపంగా ఉన్నారంటూ కొన్ని వెబ్ సైట్లు వార్తలు ప్రచురించాయి. అయితే ఈ రూమర్లకు, పుకార్లకు తెర దించుతూ త్రిష తన ట్విట్టర్లో ఓ ఫోటో షేర్ చేసింది. బాలయ్య చాలా కూల్ పర్సన్ అంటూ ట్వీట్ చేసింది.

Trisha- Balakrishna

వరుణ్ మణియన్ తో త్రిష ఎంగేజ్మెంట్ జరుగగా పలు కారణాలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి...ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. త్రిషకు ఇలా జరుగడానికి కారణం బాలయ్యతో సినిమా చేయడమే అంటూ ఆ మధ్య ఓ వింత వాదన కూడా తెరపైకి తెచ్చారు కొందరు. గతంలో నయనతార విషయంలో జరిగిన సంఘటనను త్రిష విషయంలో కూడా ఆపాదిస్తూ వార్తలు ప్రచారంలోకి తెచ్చారు.

గతంలో నయనతార బాలయ్యతో శ్రీరామరాజ్యం సినిమా చేసింది. ఆ తర్వాత ఆమెకు, ఆమె ప్రియుడు ప్రభుదేవాకు గొడవలొచ్చి విడిపోయారు. ఇపుడు త్రిష కూడా బాలయ్యతో లయన్ సినిమా చేసిన తర్వాత వరుణ్ మణియన్ తో విబేధాలు రావడంతో బాలయ్యతో చేస్తే...అంతే అంటూ కొందరు ప్రచారం చేసారు. అయితే ఇలాంటి అర్థం పర్థం లేని విషయాలను ఎవరూ పట్టించుకోలేదు.

ఇలాంటి పుకార్లు, వింత వాదనలు బాలయ్య, త్రిష మధ్య ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ పై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టమయింది.

English summary
Trisha was in news of late in Telugu media since she did not turn up to promote her latest release Lion. Few media reports informed that Balakrishna was angry on both the leading ladies of Lion, Trisha and Radhika Apte for not participating in promotions of the film.
Please Wait while comments are loading...