»   » త్రిష కొత్త చిత్రం ‘మేము’...ఫస్ట్ లుక్

త్రిష కొత్త చిత్రం ‘మేము’...ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇంతకుముందు అక్కినేని కుటుంబంతో ‘మనం' చిత్రం వచ్చి సూపర్ హిట్టైంది. ఇప్పుడు అలాంటి టైటిల్ తోనే త్రిష దిగుతోంది. ఆమె తాజా చిత్రానికి ‘మేము' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ముగ్గురు స్నేహితులు...ఒక ప్రయాణం అనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ ఫొటో ఇది. ఈ ఫొటోని త్రిష తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా షేర్ చేసింది. ఆ ఫోటోని మీరు ఇక్కడ చూడవచ్చు. తమిళంలో ఈ చిత్రం టైటిల్ భోగి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Trisha's ‘Memu’ look is best

ఆ మధ్య షూటింగ్ జరుపుకుని ఆగిపోయిందనుకున్నఈ సినిమా మళ్లీ ఆరంభమైంది. త్రిష ప్రధానపాత్రలో నటిస్తున్నలేడీ ఓరియంటెడ్ మూవీ 'మనం'. మరో ఇద్దరు హీరోయిన్స్ గా పూనం బజ్వా, ఒవియా నటిస్తుండగా సురేఖ వాణి కీలక పాత్రలో కనిపించనుంది. పాండ్యన్ దర్శకత్వంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తెరకెక్కుతున్నఈ మూవీ గత ఏడాది కొంతమేరకు షూటింగ్ జరుపుకుని ఆర్థిక కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది.... ఇక ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్టే అని అంతా అనుకుంటున్న తరుణంలో.. తాజాగా తిరిగి ఆరంభమైంది.

ఈ చెన్నై సుందరి, కెరీర్లో నటిస్తున్న ఫస్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. ముగ్గురు స్నేహితురాళ్ళు ఒక ప్రయాణంలో ఎదుర్కున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాండ్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. వరుస పరాజయాలతో త్రిషకు మార్కెట్ లేకపోవడం, ఆర్ధిక సమస్యల కారణంగా సినిమాను పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. సినిమా తిరిగి ప్రారంభం కావడంతో త్రిష చాలా సంతోషంగా ఉంది.

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో త్రిష, ఛార్మి, నికిష పటేల్ ప్రధాన పాత్రధారులుగా మొదలైన ‘రమ్' (రంభ, ఊర్వసి, మేనక) సినిమాకు మధ్యలోనే ఆగింది. మరి, ఆ సినిమా తిరిగి ప్రారంభమవుతుందో.. అని త్రిష అభిమానులు ఎదురుచూస్తున్నారు.

English summary
Besides ‘Lion’ in Telugu, Trisha is doing a Telugu-Tamil bilingual Bhogi( Memu in telugu). Trisha is sharing screen space with Poonam Bazwa and Oviya Helen in the film. Trisha recently posted a picture from the movie featuring all the three heroines and titled ‘three friends and one journey’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu