సంబరపడిపోతున్న త్రిష తల్లి
సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష చేతిలో ఈ మధ్య పెద్దగా సినిమాలు లేకున్నా యాడ్ ఫిల్మ్స్ అవకాశాలు మాత్రం ఆమెకు తరచూ వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఆమెకు ఓ మంచి ఛాన్స్ లభించింది. తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి బాసుమతి యాడ్‌లో నటించే అవకాశం దక్కింది. త్రిష సంగతి పక్కన పెడితే...తన కూతురుతో నటించే అవకాశం దఃక్కడంపై ఉమా కృష్ణన్ మాత్రం తెగ సంబర పడిపోతోంది. నాకు ఇలాంటి అవకాశం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు....చాలా ఆనందంగా ఉంది అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది.
అంతే కాదు ఈ యాడ్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించిన ఎ.ఎల్ విజయ్‌ని కూడా పొగడ్తలతో ముంచెత్తింది. ఆయన టీమ్ వర్క్ బాగుతుందని చెప్పుకొచ్చింది. విజయ్ కూడా ఉమ కృష్ణన్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకుంటున్నాడు. కాగా...ఇదే యాడ్‌ను బాలీవుడ్‌కు చెందిన తల్లీ కూతుర్లు షర్మిలా ఠాగూర్, సోహా అలీఖాన్ తో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications