»   » మళ్లీ పెద్ద హీరో సరసన త్రిష బుక్కైంది

మళ్లీ పెద్ద హీరో సరసన త్రిష బుక్కైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఇక స్టార్ హీరోలతో సినిమాలు లేవనుకొంటున్న తరుణంలో త్రిషకి ఓ కొత్త ఆఫర్ వచ్చి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ భామ తమిళ,తెలుగు భాషల్లో హీరోగా వెలుగుతున్న సూర్య సరసన ఆడిపాడబోతోంది.
ఈ నెల 'సింగమ్‌'గా తెరపైకి రాబోతున్న సూర్య నటించే కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. గౌతమ్‌ మీనన్‌ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందబోతోందీ చిత్రం. తమిళంలో 'ధ్రువనక్షత్రం' అనే పేరుని నిర్ణయించారు. ఇందులో హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేసుకొన్నారు.


ఈ నెల 17న షూటింగ్ మొదలవుతుంది. సిమ్రాన్‌, పార్తీపన్‌, సుధాంశు పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తారు. సూర్యతో కలిసి త్రిష నటించే మూడో చిత్రమిది.


తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉండటం, గౌతమ్ మీనన్ చిత్రాలకు సైతం తెలుగులో బిజినెస్ ఉండటం కలిసి వచ్చే అంశం.

నాగచైతన్యతో... ' ఏమి మాయ చేసావే ' చిత్రంతో తెలుగువారికి పరిచయమైన దర్శకుడు స్టార్ డైరక్టర్ గౌతమ్ మీనన్. ఆ తర్వాత ఆయన తమిళంలో చేసిన చిత్రాలుకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆయన మరో చిత్రం కమిటయ్యారుయ. గతంలో 'కాక్క కాక్క'(తెలుగు ఘర్షణ) తో సూర్య కి ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఆయన మరోసారి సూర్యతో చిత్రం చేయటానికి సిద్దమవుతున్నారు.

'కాక్క కాక్క' తర్వాత సూర్యతో ... 'వారనం ఆయిరం' చేసినా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ సూర్య మహిళా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించింది గౌతంమీననే. వీరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలూ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. మూడోసారి ముచ్చటగా వీరు కలిసి పనిచేయనున్నారు.

English summary
Trisha has got this offer from Gautham Menon to act opposite a top hero. Yes, she has signed Gautham Menon's new film with Surya as hero. The film has been titled in Tamil as Dhruva Natchithiram, while title in Telugu is yet to be fixed. The film will have music by A R Rahman. Cinematography will be by an Australian cameraman. The film will go on floor on 17th June.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu