మరో ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్ గా త్రిష
ఇక ఈ విషయమై త్రిష ట్వీట్ చేస్తూ.." నేను నా ఫెవెరెట్ ఐస్ క్రీమ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది..త్వరోనే ఆ బ్రాండ్ ఇండియాలో లాంచ్ అవుతోంది. ఈ విషయాలపై త్వరలోనే పోస్ట్ చేస్తాను... ;) ," అని ట్వీట్ చేసి తన సంతోషం వ్యక్తం చేసింది.
చేతిలో ఆఫర్స్ లేకపోయినా తన ఫోటో షూట్ లతో అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది త్రిష. తెలుగులో దాదాపు 20 చిత్రాలు వరకూ చేసిన ఈ ముద్దుగుమ్మ కి 2012 పెద్దగా కలిసి రాలేదు. ఆమె బాడీగార్డ్,దమ్ము చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. దాంతో ఖాళీ పడింది. అయితే తాజాగా ఎమ్.ఎస్ రాజు చిత్రం రమ్ లో బుక్కై మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఈచిత్రంలో రంభగా త్రిష మెయిన్ రోల్ చేస్తుండగా.....ఇతర హీరోయిన్లు పూర్ణ, అర్చన సైడ్ క్యారెక్టర్స్ ఊర్వశి, మేనక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో త్రిష యాక్షన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం కోసం చిత్రీకరించిన కారు రేస్ సన్నివేశంలో రిస్క్ తీసుకుని ఫైట్ చేసిందట త్రిష. దర్శక ,నిర్మాతలు డూపుతో చిత్రీకరిద్దామన్నా వద్దని వారించి మరీ ఈ త్రిష రిస్కీ ఫైట్ కోసం సాహసం చేసిందట. ఈ విషయం గురించి త్రిష తెలుపుతూ ఇలాంటి సాహసోపేత సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు హీరోలు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో అర్థం అవుతుందన్నారు.


Click it and Unblock the Notifications












