»   » బూతు కామెంట్లపై ఎదురు దాడి, ఆమెకు త్రిష మద్దతు!

బూతు కామెంట్లపై ఎదురు దాడి, ఆమెకు త్రిష మద్దతు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రౌడీ ఫెలో హీరోయిన్ విశాఖ సింగ్ పై ఫేస్ బుక్‌లో ఓ ఆకతాయి అసభ్యకరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 'Everybody is somebody's foreigner' అనే క్యాప్సన్ ఉన్న ఫోటోను విశాఖ సింగ్ ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అయితే ఓ వ్యక్తి ఆమె ఫోటోపై బూతు కామెంట్లు, వల్గర్ కామెంట్లు చేయడం ప్రారంభించారు. "Nice looking & nice b**bs" అంటూ కామెంట్స్ చేసాడు.

సదరు వల్గర్ కామెంట్లపై విశాఖ సింగ్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. నీ తల్లికి, చెల్లికి, భార్యకి, బామ్మకి, స్నేహితులకూ కూడా వక్షోజాలు ఉంటాయి. నీలాంటి మూర్ఖులకు మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదు. అదే మాట నీ తల్లితోనో, చెల్లితోనో అనగలవా? నా పేజీ నుండి గెట్ ఔట్ అంటూ కోపంగా రిప్లై ఇచ్చింది విశాఖ సింగ్.

Trisha Sings Praises To Vishakha Singh For That Bold Reply

ఈ కామెంట్లకు సంబంధించిన వివాదం తీవ్రం కావడంతో.... తన పోస్టింగును ఫేస్ బుక్ నుండి తొలగించింది. వివాదానికి తెరదించడానికే తాను ఆ పోస్టును తొలగించినట్లు విశాఖ సింగ్ తన ఫేస్ బుక్ టైమ్ లైన్ మీద పేర్కొన్నారు.

కాగా.... ఆకతాయికి గట్టిగా రిప్లై ఇచ్చిన విశాఖ సింగ్‌ను హీరోయిన్ త్రిష ప్రశంసించింది. అలాంటి ఆకతాయిలకు బుద్ది చెప్పాలంటే ఆ మాత్రం ధైర్యం ఉండాలి. మంచి పని చేసావ్ అంటూ ఆమెపై పొగడ్తలు గుప్పించింది.

English summary
Past two days, Vishakha Singh has attained all the attention for her bold and perfect reply to a perverted fan's comment. When the actress posted a picture of hers on her official Facebook page, "Nice looking & nice b**bs", a pervert commented.
Please Wait while comments are loading...