For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ విషయాన్నే 'జులాయి'లో చెబుతున్నా:త్రివిక్రమ్‌

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో రూపొంది విడుదలకు సిద్దమైన చిత్రం 'జులాయి'. ఈ చిత్రంలో ఈజీమనీ గురించి చెబుతున్నారు త్రివిక్రమ్‌. హీరో లక్ష్యం రాత్రికి రాత్రే డబ్బు సంపాదించడం. దాని కోసం అతను ఎలాంటి మార్గంలో వెళ్లాడో.. ఆ సినిమాలో చూపిస్తున్నారు. ''సులభంగా డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. కానీ అదంతా ముళ్ల బాటే. ఆ విషయాన్ని 'జులాయి'లో చెబుతున్నాం'' అని త్రివిక్రమ్‌ చెప్పారు.

  నిర్మాణ సమయంలోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన సినిమా 'జులాయి'. ట్రైలర్స్‌లో అల్లు అర్జున్ పలుకుతున్న త్రివిక్రమ్ డైలాగులు సినిమాపై మరింత ఉత్సుకతను పెంచుతున్నాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.రాధాకృష్ణ మాట్లాడుతూ -''ఇది త్రివిక్రమ్ మార్క్ సినిమా. ఇందులో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ భిన్నంగా ఉంటుంది.

  అల్లు అర్జున్ ఎనర్జీ, అబ్బురపరిచే ఆయన డాన్సులు, త్రివిక్రమ్ టేకింగ్, ఆయన నాసిన సంభాషణలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయి. డా.రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేశారు. రాజేంద్రప్రసాద్, అల్లు అర్జున్ కలిసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి... ఇలా అన్ని పాత్రలకూ సమ ప్రాధాన్యం ఉంటుంది.ఇలియానా ఇందులో కొత్తగా కనిపిస్తారు. సెన్సార్ వారి నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ ఈ సినిమాకు లభించింది. అన్ని వర్గాలవారినీ ఆనందపరిచే పర్‌ఫెక్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది'' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ఆర్ట్: రవీందర్, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.

  ''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.

  English summary
  Allu Arjun’s next entertainer Julayi is aiming for release on the 9th of Aug. This is confirmed by producer. The music has been composed by Devi Sri Prasad and the title track has been done by Rama Jogayya Shastry. The movie is expected to be the next Super Hit in line.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X