»   » అదే నేను త్రివిక్రమ్‌లో గమనించిన తేడా : శిష్యుడి గురించి పోసాని

అదే నేను త్రివిక్రమ్‌లో గమనించిన తేడా : శిష్యుడి గురించి పోసాని

Posted By:
Subscribe to Filmibeat Telugu

90లలో త్రివిక్రమ్ ఇండస్ర్టీకి వచ్చిన కొత్తల్లో మనోడికి 4 సంవత్సరాలపాటు పోసాని కృష్ణమురళి దగ్గరే పని చేసాడు. ఆ నాలుగేళ్ళలోనే పోసానుఇ రైటర్ గా ఏకంగా 100 సినిమాలకు రాశాడు ఖచ్చితంగా తన టీం లో ఉన్న త్రివిక్రం లాంటి అద్బుతంగా రాసేవారి సహకారం తోనే అనుకోవచ్చు. అప్పట్లో ఈ "మూడీగా కనిపించే" కుర్రాడికి పని చెప్పి రాయించుకున్న కృష్ణ మురళి ఇప్పుడు నటుడిగా త్రివిక్రం ఆదేశాలను పాటించాలి... మరి ఈ విశయం లో పోసాని ఎలా ఫీలై ఉంటారు???

ఇదే మాట ఆయన్ని అడిగారు ఒక ఇంటర్వ్యూలో పోసాని సమాధానం ఏమిటో తెలుసా..!? త్రివిక్రం అనే బిడియస్తుడైన కుర్రాడు నాదగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నాడు. అదే మాట తీరు. అదే వినయం. అదే రెస్పక్ట్ ఇచ్చే పద్దతి. అతను ఏమాత్రం మారలేదు అయితే ఒకే ఒక మార్పు ఏమిటంటే ఇప్పుడు కాస్త గెడ్డం పెంచుతున్నాడు అప్పూడేమో క్లీన్ షేవ్ లో ఉండేవాడు అంతే తేడా....

అప్పుడు అతను నా దగ్గర పనిచేశాడు. నేనిప్పుడు తన దగ్గర పనిచేస్తున్నాను ఇద్దరమూ పరస్పరం ఇచ్చుకునే గౌరవం కంటే పనిమీద మాకిద్దరికీ ఉండే గౌరవం ఎక్కువ. ఇక్కడ ఈగో కి స్థానం లేదు చేసే పనిమీద ఉండే భక్తికి తప్ప.... అంటూ చెప్పుకొచ్చాడు.

Trivikram is a Trend Setter in Tollywood says Posani Krishna Murali

అంతేకాదు..అప్పట్లో త్రివిక్రం గురించి చెబుతూ "కథలు పక్కన పెట్టి వట్టి మాటలు రాస్తున్నాడు.., కథ రాయలేకపోతున్నాడు ఇతని భవిశ్యత్ ఏమిటో అసలు కాన్సంట్రేషన్ చేయడేంటా ఈ త్రివిక్రమ్ అనుకునేవాడిని. అయితే కేవలం మాటలతోనే కథను తయారు చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు మనోడు. కేవలం మాటలతోనే మ్యాజిక్ చేసే ఒక ట్రెండ్ సెట్టర్ త్రివిక్రమ్ అందుకు చాలా హ్యాపీగా ఉంది....

"అ..ఆ సినిమాలో ఓ విలన్ వేశం మాంచి దుర్మార్గంగా ఉండే వేశం ఇచ్చాడు ఇరగదీసి పడేశా అంతే" అంటూ తన శిశ్యుడి గురించీ... ఇప్పటి దర్శకుడి గురించీ చెప్పాడు పోశాని... ఎప్పుడూ సీరియస్ గా మాట్లాడుతూ...నిర్మొహ మాటంగా మొహాన కొట్టినట్టు మాట్లాడే పోసాని లోపలలోపల ఎంత సున్నితంగా ఉంటాడో ఇమందస్ట్రీలో కొందరికే తెలుసు... అందులో త్రివిక్రం కూడా ఒకరు...

English summary
"Trivikram is a Trend Setter of Tollywood" says Posani Krishna Murali who is trivikram's guru in past.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu