»   » అఫీషియల్: త్రివిక్రమ్, పవన్, నితిన్‌ల కాంబినేషన్ లో సినిమా! (ఫొటోలు)

అఫీషియల్: త్రివిక్రమ్, పవన్, నితిన్‌ల కాంబినేషన్ లో సినిమా! (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. అలాగే నితిన్ కు, పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుబంధం కూడా ఓ భక్తుడు, దేముడు అన్నస్దాయిలో ఉంటుంది. దానికి తోడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ..ఆ..' సినిమాతో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ కొట్టారు నితిన్. దాంతో ఈ ముగ్గరూ కలిస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుంది..ఆలోచన వినటానికే ఓ రేంజిలో ఉంది కదా..ఇప్పుడు ముగ్గరూ కలిసే ఓ ప్రాజక్టుని నిర్మిస్తున్నారు.

'అ..ఆ..' చిత్రం తర్వాత ని తర్వాత చేయబోయే సినిమాలు కూడా హీరోగా తన స్థాయిని పెంచేవే కావాలన్న ఉద్దేశంతో జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. అందులో భాగంగానే యువ దర్శకుడు హను రాఘవపూడితో ఓ సినిమా మొదలుపెట్టిన నితిన్, ఈరోజు మరో క్రేజ్ ప్రాజెక్టును అనౌన్స్ చేసారు.

ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కలిసి నిర్మించనున్నారు. ఇదిగో నితిన్ ట్వీట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

అయితే ఇంత ప్రెజ్సీజియస్ రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరు డైరక్ట్ చేయబోతున్నారు అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు క్రింద చదవండి.

 లిరికిస్ట్ డైరక్టర్

లిరికిస్ట్ డైరక్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శీనివాస్, ప్రముఖ పంపిణిదారుడు, నిర్మాత సుధాకర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకుడు.

 అలాగే త్రివిక్రమ్ కథ కూడా

అలాగే త్రివిక్రమ్ కథ కూడా

తొలిసారి పవన్ కల్యాణ్ తాను కాకుండా తన బ్యానర్ పై మరో హీరో నితిన్ కొసం నిర్మాతగా మారటం విశేషం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలతో పాటు మూల కధను సమకూర్చటం మరో హైలెట్.

 త్రివిక్రమ్ కెమెరా స్విఛ్చాన్

త్రివిక్రమ్ కెమెరా స్విఛ్చాన్

ఇంతటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శ్రేష్ట్ మూవీస్ సంస్థ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు పవన్ కల్యాణ్ క్లాప్ నివ్వగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

 నితిన్ అంటే అంత అనుబంధం

నితిన్ అంటే అంత అనుబంధం

పవన్ కళ్యాణ్, యంగ్ హీరో నితిన్ ల అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తన సొంత సినిమా ఫంక్షన్లకైనా మిస్ అవుతాడేమో కాని నితిన్ సినిమా ఫంక్షన్ కు పవన్ ఎప్పుడూ మిస్ అవ్వడూ. నితిన్ కూడా తన ప్రతీ సినిమాలో ప్రస్థావన తేకుండా ఉండడు. ఎన్నో వేదికల మీద పవర్ స్టార్ తన అభిమాన హీరో అని ప్రకటించాడు నితిన్. అందుకే నితిన్ సినిమాలకు పవన్ అభిమానులు కూడా అండగా ఉంటూ వస్తున్నారు.

ఫ్యాన్ కోసం...

ఫ్యాన్ కోసం...

నితిన్ తన మీద చూపిస్తున్న అభిమానానికి బదులు తీర్చుకునేందుకు రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. ఇప్పటికే నితిన్ సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ ఈ యంగ్ హీరోను సపోర్ట్ చేస్తున్న పవన్, త్వరలోనే నితిన్ హీరోగా తన సొంత బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు.

 కథ నచ్చి ప్రొడ్యూస్ చేస్తానన్నాడు

కథ నచ్చి ప్రొడ్యూస్ చేస్తానన్నాడు

రౌడీఫెలో' సినిమా డైరెక్టర్‌, గీత రచయిత కృష్ణ చైతన్య ఈ సినిమాకు డైరెక్టర్‌. చైతన్య ఈ కథను మొదట త్రివిక్రమ్‌కు చెప్పాడు. ఆ కథ నచ్చి ఆ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తానని త్రివిక్రమ్‌ ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు అది ఇలా ఫైనలైజ్‌ అయిందన్నమాట.

తొలి చిత్రం నిరాశ పరిచినా

తొలి చిత్రం నిరాశ పరిచినా

నారా రోహిత్ తో చేసిన రౌడీ ఫెలో ఫ్లాఫ్ అయినా, సినిమాకు మంచి పేరు వచ్చింది. దర్శకుడుగా బాగా డీల్ చేసాడని అందరూ అన్నారు. దాంతో నితిన్ వెంటనే అతని దర్శకత్వంలో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 ఈ టీమ్ అంతా కలిసే..

ఈ టీమ్ అంతా కలిసే..


పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తాను ఎంతగానో అభిమానించే వ్యక్తులని చెబుతూ ఉండే నితిన్, వారిద్దరితో కలిసి పనిచేయనుండడం విశేషమని చెప్పుకోవాలి.
హీరోయిన్, నటీనటులు, పూర్తి టెక్నికల్ టీమ్ మరియు షూటింగ్ సంబందిత వివరాలను త్వరలొనె తెలియచెస్తారు .
ఈ చిత్రానికి మూల కథ: త్రివిక్రమ్ శ్రీనివాస్,
సినిమాటోగ్రఫీ : ఎన్. నటరాజ సుబ్రహ్మణ్యన్,
ఆర్ట్: రామకృష్ణ,
కథ- మాటలు- స్క్రీన్‌ప్లే - దర్శకత్వం : కృష్ణ చైతన్య

English summary
Nithiin ‏ tweeted: Very excited 2 announce my new movie 2 b produced by PSPK garu TRIVIKRAM garu n my FATHER under Pawankalyan creative works n Sreshthmovies
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu