»   » పవన్ తో ఫోన్ లో మాట్లాడుతూంటే...‌: త్రివిక్రమ్ (ఫొటోలు,వీడియో)

పవన్ తో ఫోన్ లో మాట్లాడుతూంటే...‌: త్రివిక్రమ్ (ఫొటోలు,వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: "ఇందాక నేను కళ్యాణ్ గారు ఫోన్ లో మాట్లాడుకుంటూంటే...నేను ఫంక్షన్ కు రాలేదు అంటే ఏం సమాధానం చెప్తారు అన్నారు ఆయన.. నేను ఎందుకు రాలేదు అని అక్కడ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అడిగారు. దానికి కొత్తగా డైలాగు రాయటమెందుకు..నేను రాసిందే ఆల్రెడీ ఉంది కదా...అని వాడుకుంటున్నాను. అమ్మని, దేముడ్ని చూడాలంటే మనమే వెళ్లాలి. వాళ్లని రమ్మనమని అడగకూడదు" అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. ఇదంతా సన్నాఫ్ సత్య మూర్తి చిత్రం ఆడియో లాంచ్ స్టేజీపై చెప్పిన మాటలు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ' సన్నాఫ్‌ సత్యమూర్తి'.సమంత, నిత్యమేనన్‌, అదాశర్మ , రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హోటల్‌ నోవాటెల్‌లో జరిగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

త్రివిక్రమ్ మాట్లాడింది మీరు చూడాలనుకుంటే... ఇక్కడ

త్రివిక్రమ్ ఇంకేం మాట్లాడారు...మిగతా ఫొటోలు...

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...

అందరికీ నమస్కారం..ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరీకీ , నాతో పనిచేసిన టెక్నిషియన్స్ అందరికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఉపేంద్రగారికి అన్నారు.

పవన్ విషెష్

పవన్ విషెష్

నా ప్రియమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారి శుభాకాంక్షలు.. నాకు, బన్నీకి, ఈ టీమ్ కు అందరికీ ఉంటాయని నమ్ముతున్నాను అన్నారు త్రివిక్రమ్

ఇంకా...

ఇంకా...

ఈ సినిమాలో పనిచేసిన బన్నీ, సమంత, నిత్యామీనన్ కి అందరికీ ధాంక్యూ అన్నారు త్రివిక్రమ్

నాకు ఫ్రెండ్ కూడా...

నాకు ఫ్రెండ్ కూడా...

నిర్మాత రాధాకృష్ణగారు నాకు ప్రొడ్యూసరే కాదు నాకు మంచి స్నేహుతులు. మీకు ఈ సినిమా నచ్చుతుందనే భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

జూలాయిలాగే..

జూలాయిలాగే..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా కావంటంతో మంచి అంచనాలు ఉన్నాయి.

భారీగా..

భారీగా..

తివిక్ర‌మ్ అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం త‌రువాత చేస్తున్నందున‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి అన్నారు.

మాటలు అదిరాయి

మాటలు అదిరాయి

ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్ ఇప్పటికే అందరూ చూసి ఉన్నారు. మాటలు చాలా బాగున్నాయని మరోసారి త్రివిక్రమ్ కలం పదను చూపాడంటున్నారు.

కలర్ ఫుల్ గా...

కలర్ ఫుల్ గా...

సినిమాని పూర్తి స్ధాయి కలర్ ఫుల్ గా తీర్చిదిద్దాడని ట్రైలర్ చూస్తూంటే అర్దమవుతోంది.

ఫ్యామిలీలను

ఫ్యామిలీలను

త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి నుంచి కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మరోసారి కుటుంబమంతా కూర్చుని చూడదగ్గ చిత్రం ఇస్తున్నాడంటున్నారు.

టైటిల్ తోనే

టైటిల్ తోనే

సినిమా టైటిల్ తోనే అందరిని తన వైపు తిప్పుకున్నారు. అందరూ కుటుంబం,విలువలు,తండ్రి కోసం చేసే కథ కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

English summary
Allu Arjun's 'S/O Satyamurthy' audio released at Novotel Hotel, Hyderabad.
Please Wait while comments are loading...