For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ సుమతో చాలా జాగ్రత్తగా ఉండాలి.. మెగాస్టార్ వల్లే కాలేదు: లైవ్ లోనే త్రివిక్రమ్ హెచ్చరిక

  |

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా తన మాటలతో ఏ విధంగా ఆకట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఈవెంట్స్ కు ఎంతమంది వచ్చినా కూడా త్రివిక్రమ్ స్పీచ్ కోసమే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సందర్భం ఏదైనా సరే దానికి తగ్గట్టుగా ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఆలోచింపజేసే విధంగా మాటల బాణాలను వదులుతుంటారు. ఇక రీసెంట్ గా సుశాంత్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో మరోసారి తన స్పీచ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా ఈ వేడుకలో యాంకర్ సుమపై కొన్ని పంచులు వేసే అందర్నీ నవ్వించారు. ఆమెను తట్టుకోవడం మెగాస్టార్ చిరంజీవి వల్ల కూడా కాలేదు అని . కాబట్టి ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా స్టేజ్ పైన ఓపెన్ గా చెప్పేశారు.

  త్రివిక్రమ్ పంచ్ లు

  త్రివిక్రమ్ పంచ్ లు

  సుశాంత్ అల వైకుంఠపురములో సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి త్రివిక్రమ్ తో ఆయనకు మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఓ వైపు సినిమా గురించి మాట్లాడుతూనే మరో వైపు నటీనటుల పై తనదైన శైలిలో కామెడీ పంచులు వేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  మంచి కంటెంట్ క్రియేట్ చేద్దాం.

  మంచి కంటెంట్ క్రియేట్ చేద్దాం.

  త్రివిక్రమ్ శ్రీనవాస్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత సినిమా ఫంక్షన్ పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇండియా మొత్తంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో థియేటర్ కి రావడానికి సాహస చేస్తున్న జాతి తెలుగు జాతి మాత్రమే. భయపడక్కర్లేదు. బాగా తీద్దాం. మంచి కంటెంట్ క్రియేట్ చేద్దాం. మరింత ముందుకు వేళదాం. నాకు సుశాంత్ ఈ సినిమా చేస్తున్నాడు అని అలా వైకుంఠపురములో షూటింగ్ టైమ్ లోనే చెప్పాడు. చాలా సందర్భాల్లో కూడా ఈ సినిమా చాలా బాగా వచ్చిందని అన్నాడు. అతని మొహంలోనే నాకు సక్సెస్ కనిపించింది.

  అల.. వైకుంఠపురములో అందుకే ఛాన్స్ ఇచ్చాను

  అల.. వైకుంఠపురములో అందుకే ఛాన్స్ ఇచ్చాను

  హీరోగా సినిమా చేయాలని కొన్ని లెక్కలు వేసుకోవడం వలన ఒక నటుడి పరిస్థితి ఎటో వెళ్లి పోతుంది. కానీ చిలౌసౌ సినిమా తర్వాత సుశాంత్ నుంచి ఒక మంచి నటుడు వచ్చాడు అని నాకు అర్థం అయింది. ఆ సినిమా చూసిన తర్వాత నేను సుశాంత్ ను అల వైకుంఠపురములో నటించమని అడిగాను. చిలౌసౌ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న సుశాంత్ ఆ తర్వాత అలా వైకుంఠపురం సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో మరొక హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని చెప్పవచ్చు. నేను చాలన్స్ కట్టడం కంటే కూడా అందరిని ఆగస్ట్ 27న థియేటర్ కు రప్పించి 100, 150 రూపాయలతో చాలన్స్ కట్టించమని చిత్ర యూనిట్ ను నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాతో నిర్మాతకు లాభాలు అందించి ప్రభుత్వానికి కూడా టాక్స్ కూడా కట్టిద్దామని అన్నారు.

  అంతకంటే మరొకటి ఉండదు.

  అంతకంటే మరొకటి ఉండదు.

  ప్రతి దర్శకుడికి కూడా మొదటి సినిమా అంటే ఒక ఆడపిల్లను అత్తగారింటికి పంపిస్తున్నట్లు ఉంటుంది. మిక్సింగ్ రికార్డు అయిపోయిన తర్వాత థియేటర్లోకి పంపితే కన్న కూతురిని పంపిస్తున్నట్లు ఫీలవుతుంటారు. సినిమా థియేటర్స్ కి వెళ్ళిన తర్వాత అనంతరం టీవీలలో ఓటీటీలలో ఏదో ఒక విధంగా జనాల్లో నానుతూనే ఉంటుంది. ఆ సినిమాతో జనాల్లో ఎంతో ఆనందకరంగా ఉంటారు. ఆ విధంగా ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను. అల వైకుంఠపురములో షూటింగ్ చేసేటప్పుడు కూడా సుశాంత్ ఎంతో ఆనందంగా ఉండడం చూశాను. అతని ఆనందం చూసి నాకు కూడా చాలా అందంగా అనిపించింది.ఒక మనిషి తనను తాను ఆనందంగా ఉంటే చేసే ప్రతి పని కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతకంటే మరొకటి ఉండదు.

  సుమతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

  సుమతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

  ఈ సినిమాలో ఒక రోజులో ఒక పాటను పూర్తిచేశారు రాగానే నాకు ఎంతో ఆనందం వేసింది అక్కడే సినిమా సక్సెస్ కూడా కనిపించింది. అభినవ్ గోమటం గురించి మాట్లాడుతూ ట్రైలర్ అంటే తెలుగులో ప్రచార చిత్రాన్ని ప్రజలలోకి వదిలేయడం. మళ్లీ చిట్టి చిత్రం అంటే అది షార్ట్ ఫిలిం అవుతుందని అతనికి చెప్పినట్లు స్టేజ్ పైన త్రివిక్రమ్ మాట్లాడారు. మీరు చిట్టి చిత్రం అంటే సుమ గారు మిమ్మల్ని ర్యాగ్ చేసే అవకాశం ఉంది. ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి చిరంజీవి లాంటి వారే స్టేజిపైకి వచ్చే ముందు ఏం మాట్లాడాలో చదువుకొని ఎక్కుతారు. అంటే అంత జాగ్రత్తగా ఉంటారు. మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారే సుమను హ్యాండిల్ చేయగలరు ఏదేమైనా సుమ గారిని చాలా రోజుల తర్వాత స్టేజ్ పైన ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందని ఈ విధంగా మళ్లీ సినిమా చిత్రపరిశ్రమ మరింత ముందుకు సాగాలని ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నట్లు త్రివిక్రమ్ తెలియజేశారు.

  English summary
  Trivikram srinivas excellent speech at ichata vahanamulu nilupa radu event,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X