For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya కమెడియన్ డైలాగ్ కాపీ కొట్టారని ట్రోలింగ్.. చిరంజీవికి ఘోరమైన అవమానం అంటూ!

  |

  మెగా స్టార్ చిరంజీవి-మాస్ మహారాజ రవితేజ కలిసి చాలా కాలం తర్వాత నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు కాచుకుని కూర్చున్నారు. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 13న అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమాకు డైరెక్టర్ కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో చిరు చెప్పిన డైలాగ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు అందులోని ఒక డైలాగ్ కాపీ అంటూ ట్రోలింగ్ జరుగుతోంది.

  ఖైదీ నెం 786 తో రీ ఎంట్రీ..

  ఖైదీ నెం 786 తో రీ ఎంట్రీ..

  స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. అనేక చిత్రాలతో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ బాస్ గా మారారు. ఆ మధ్య సినిమాలు వదిలి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన చిరంజీవికి అంతగా కలిసి రాలేదు. దీంతో మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు చిరు. ఖైదీ నెం 786 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు.

  మాస్ అవతారంతో..

  మాస్ అవతారంతో..


  2022 సంవత్సరంలో ఆచార్యతో ప్లాప్ అందుకున్న చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి వాల్తేరు వీరయ్యగా అలరించేందుకు థియేటర్లలో ప్రేక్షకులు ముందుకు వచ్చేశాడు. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన చిత్రమే వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ కనిపించాడు.

  విపరీతమైన క్రేజ్..

  సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై క్రేజీగా బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ మెగా అభిమానులను అలరించింది. ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి, వీరయ్య, పూనకాలు లోడింగ్, నీకు అందమెక్కువ.. నాకు తొందరెక్కువ పాటలకు విపరీతమైన స్పందన వచ్చింది.

  డైలాగ్ పై ట్రోలింగ్..

  గ్లామరస్ బ్యూటి శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న అంటే ఇవాళ ప్రేక్షకులు, అభిమానుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే సినిమాపై రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో చిరంజీవి చెప్పిన ఒక డైలాగ్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

  విజిల్స్ వేయించేలా..

  ఆ ట్రైలర్ చూస్తే మసాలా వంటి అన్ని అంశాలతో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా చిరంజీవి డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. ఇందులో చిరంజీవి ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీలర్ అని రివీల్ చేశారు. అతన్ని పట్టుకునేందుకు పోలీస్ అధికారిగా రవితేజ కనపించాడు. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టింది ఆయన్ను చూసే అంటూ చిరు గురించి హైఓల్టేజ్ ఎలివేషన్ ఇచ్చారు. "రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీద రికార్డులు ఉంటాయి" అనే డైలాగ్ ప్రధానంగా హైలెట్ అవడమే కాకుండా విజిల్స్ వేయించేలా ఉంది.

  విన్నర్ లో సింగం సుజాతగా..

  ఇప్పుడు ఈ డైలాగ్ పైనే సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ డైలాగ్ ఇదివరకే సాయి ధరమ్ తేజ్ నటించిన "విన్నర్" సినిమాలో ఉండటమే అందుకు కారణం. విన్నర్ మూవీలో సింగం సుజాతగా ప్రముఖ కమెడియన్ పృథ్వీ రాజ్ అలరించారు. హీరో ఏడిపిస్తున్నాడన్న కారణంతో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పోలీసులను ఆశ్రయిస్తుంది. ఆ సమయంలోనే "రికార్డ్సులో నా పేరు ఉండటమేంట్రా.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి.. సుజాత.. సింగం సుజాత" అంటూ కామెడీ పండించాడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్

  చిరంజీవికి పెద్ద అవమానం..


  ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ నే వాల్తేరు వీరయ్య చిత్రంలో కాపీ కొట్టారని ట్విట్టర్ లో ట్రోలింగ్ మొదలైంది. "సింగం సుజాత అంటూ చీప్ కమెడియన్ పృథ్వీరాజ్ చెప్పన డైలాగ్ చిరంజీవి సినిమాలో ఉంది. చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమా పెద్ద అవమానం. ఎవరు చూడకండి" అంటూ పోస్టులు పెడుతున్నారు.

  English summary
  Chiranjeevi Gets Trolled For Copying Winner Movie Comedian Prudhvi Raj Records Dialogue Used In Waltair Veerayya
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X