»   » ‘ట్యూబ్ లైట్’ అఫీషియల్ ట్రైలర్: బాలీవుడ్లో మరో భారీ హిట్టయ్యేట్లే ఉంది

‘ట్యూబ్ లైట్’ అఫీషియల్ ట్రైలర్: బాలీవుడ్లో మరో భారీ హిట్టయ్యేట్లే ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ట్యూబ్ లైట్'. హిస్టారికల్ వార్ నేపథ్యంలో సాగే ఈ సినిమా 1962 లో జరిగిన చైనా ఇండియా వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ చైనా అమ్మాయి ప్రేమలో పడే యువకుడిగా నటిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అపీషియల్ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ చూసినవారంతా బాలీవుడ్లో మరో భారీ హిట్ ఖాయమని అంటున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన చైనా హీరోయిన్ జూజూ నటిస్తుంది.

సల్మాన్‌ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌ రీల్‌ లైఫ్‌ సోదరుడిగా సైనికుడి పాత్రలో నటించడం విశేషం. ఇందులో దాదాపు 600 మంది సైనికులుగా నటించారు. సినిమాలో ప్రతీ సన్నివేశం వాస్తవికంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ 600 మందికీ మన భారత సైనికులే శిక్షణ ఇచ్చారట. ఈ సినిమాకు నిర్మాత కూడా సల్మాన్‌ఖానే.

ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్ అందించారు. 2017 ఈద్ సందర్భంగా మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే జూన్ 23న లేదా 22న సినిమా విడుదలయ్యే అవకావం ఉంది.

English summary
Watch the official trailer of Tubelight. Produced by Salman Khan Films, starring Salman Khan, Zhu Zhu and Sohail Khan, Tubelight is directed by Kabir Khan. The film will release in theaters this Eid 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu