»   » అతని బిడ్డకి తల్లెవరో అతనికే తెలియదు: ఈ బాలీవుడ్ హీరో తండ్రెలా అయ్యాడంటే....

అతని బిడ్డకి తల్లెవరో అతనికే తెలియదు: ఈ బాలీవుడ్ హీరో తండ్రెలా అయ్యాడంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

తుషార్ కపూర్ బాలీవుడ్ లో మరీ స్టార్ రేంజ్ కాక పోయినా ఒక మొస్తరు గుర్తింపు ఉన్న హీరో. తన సినిమాల ద్వారా పెద్ద సంచలనాలు నమోదు చేయలేకపోయినా నిజ జీవితం లో మాత్రం ఒక వింత నిర్ణయం ద్వారా ఇప్పుడు వార్తల్లోకెక్కాడు. బాలీవుడ్‌లో లోప్రొఫైల్ మెయింటెన్ చేసే ఈ హీరో తాజాగా తండ్రి అయ్యాడు. తండ్రీవటం వింతేం కాదు గానీ పుట్టిన బాలుడి తల్లి ఎవరో అతనికి కూడా తెలియదు. అదెలా అంటే

పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన తుషార్‌.. సరోగసీ (అద్దె కడుపు), ఐవీఎఫ్ విధానంలో ఒక బిడ్డని కన్నాడు. గతవారం పుట్టిన ఈ చిన్నారికి లక్ష్య అని పేరు పెట్టామని, ప్రస్తుతం ఇంటికి చేరిన లక్ష్య ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పాడు.

Tusshar Kapoor

"తండ్రి కావడం నాకెంతో ఆనందంగా ఉంది. తండ్రి అయ్యానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లక్ష నా జీవితంలోకి రావడం మాటలకు అందని ఆనందాన్ని ఇస్తోంది. నా జీవితాన్ని ఎంతో ఆనందాయకంగా ఇది మార్చబోతోంది. దేవుడి అపారమైన దయ వల్ల, జస్‌లోక్ (ఆస్పత్రి) వైద్యసిబ్బంది అద్భుతమైన కృషి వల్ల ఇది సాధ్యమైంది. సింగల్ పెరెంట్ కు ఇది నిజంగా గొప్ప ప్రత్యామ్నాయం" అని చెబుతూ తన కొడుకు గురించి అందరికీ చెబుతున్నాడు. బాలీవుడ్ లో తొలి సింగల్ పెరెంట్‌ గా తుషార్ నిలిచాడు.

అలనాటి హీరో జితేంద్ర-శోభాకపూర్ ల కుమారుడైన తుషార్ చేసిన పని పట్ల సానుకూలం గానే స్పందించారు అతని తల్లి తండ్రులు. తుషార్ ఒక మంచి తండ్రికాగలడు కానీ అతనికి పెళ్ళి, సంసార జీవితం ఇష్టం లేకపోవటం వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకోవటం తమకు సమ్మతమేననీ. తమ మనవన్ని ప్రేమగా చూసుకోవటానికి తాము సిద్దంగా ఉన్నట్టు తెలిపారు.

English summary
Tusshar Kapoor has become father to a baby boy. The actor – who is unmarried – fathered the new born through surrogacy using IVF. Elated at turning a single parent with the aid of medical technology at Jaslok Hospital in Mumbai, Tusshar is understandably ecstatic and has named the baby Laksshya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu