twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్య డెలివరీ కవరేజ్ పై క్యూరియాసిటినీ తగ్గించుకోండి: బిఈఎ..!?

    By Sindhu
    |

    ప్రతి విషయాన్ని పదే పదే చూపుతూ, అనవసరమైన వ్యక్తిగతమైన అంశాలకు లేనిపోని ప్రాధాన్యాన్నిస్తూ కవర్ చేసే టీవీ చానెల్స్ అత్యుత్సాహానికి సంకెల పడుతోంది. ఈ విషయంలో తొలిసారిగా అందాలతార ఐశ్వర్యా రాయ్ కాన్పు కవరేజీని నియంత్రించడానికి 'బిఈఎ" (బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్) నడుంబిగించింది. 11.11.11 న జరిగే ఐష్ కాన్పు కవరీజీ విషయంలో టీవీ చానెల్స్ కు మార్గదర్శకాలు సూచించింది. కాన్పు ముందు ఎలాంటి కథనాలు ప్రసారం చేయకూడదు. కాన్పుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే కథనాలు ప్రసారం చేయాలి. బ్రేకింగ్ న్యూస్ పేరుతో వార్తలు ఇవ్వకూడదు.

    ఐష్ చేరిన ఆసుపత్రి బయట కానీ, వారి ఇంటి వద్ద కానీ ఓబీ వ్యానుల్ని (లైవ్ కవరేజీ ఇచ్చే వాహనాలు) ఉంచరాదు. అమితాబ్ కుటుంబం వారు ఇస్తే తప్ప డెలివరీకి సంబంధించిన ఎలాంటి ఫోటోలు ప్రసారం చేయకూడదు. అలాగే, ఆమెకు పుట్టే బేబీ గురించిన ఎలాంటి జ్యోతిష్యాలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించరాదు. ఇక ఆ తేదీకి, బేబీ జననానికీ ముడిపెడుతూ ఎలాంటి కథనాలు అల్లకూడదు. ఈ మార్గదర్శకాలను టీవీ చానెల్స్ అన్నీ పాటించాలని (బిఈఎ)కోరింది. దీంతో ఐష్ డెలివరీపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలనుకున్న టీవీ చానెల్స్ ఉత్సాహంపై చన్నీళ్లు చల్లినట్టయిందని చాలా మంది వాపోతున్నారు. అయినా, వీటిని ఎన్ని చానెల్స్ పాటిస్తాయో చూడాలి...!

    English summary
    Indian television stations will control coverage of the birth of Aishwarya Rai and Abhishek Bachchan's baby under guidelines issued by the Broadcast Editors' Association (BEA). The married couple, popularly known as "Ash-Abhi" is expecting their first child this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X