»   » ఎన్టీఆర్ సినిమాలో ఆ ఇద్దరు సీనియర్ హీరోయిన్లు!

ఎన్టీఆర్ సినిమాలో ఆ ఇద్దరు సీనియర్ హీరోయిన్లు!

Subscribe to Filmibeat Telugu

జై లవకుశ వంటి మంచి విజయం తరువాత ఎన్టీఆర్ నటించబోయే చిత్రం గురించి అందరిలో ఆసక్తి పెరిగింది. జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో అదరగొట్టాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇదే.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది. మీనా, లయ ఇద్దరు సీనియర్ హీరోయిన్లు చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్లకు తల్లుల పాత్రల్లో వీరు కనిపిస్తారని సమాచారం.

Two senior heroines to play key role in NTR, Trivikram film

హారికా అండ్ హాసిని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నా తమన్ సంగీతం అందించనున్నాడు. హాట్ బ్యూటీ పూజా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించనుంది. డీజే చిత్రం తరువాత పూజా కు వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి.

English summary
Two senior heroines to play key role in NTR, Trivikram film. This movie will go sets very soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X