twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నరకం చూపించాడు, నా ఫోటో వేయలేదు: మీడియా ముందే వేణు మాధవ్ కామెంట్స్!

    By Bojja Kumar
    |

    రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో దాదాపు టాలీవుడ్లో ఉన్న అందరు కమెడియన్లతో తెరకెక్కిన చిత్రం 'ఊ.పె.కు.హ'. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అనేది కాప్షన్. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌కు జోడీగా సాక్షీ చౌదరి నటించింది. 'నిధి' ప్రసాద్ దర్శకత్వం వహించగా జెబి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వేణు మాధవ్ మాట్లాడుతూ దర్శకుడి తీరు గురించి, రాజేంద్రప్రసాద్ బిహేవియర్ గురించి వివరించారు.

    సెట్లో రాజేంద్ర ప్రసాద్ బిహేవియర్ గురించి వేణు మాధవ్

    సెట్లో రాజేంద్ర ప్రసాద్ బిహేవియర్ గురించి వేణు మాధవ్

    ఈ చిత్రానికి నిధి ప్రసాద్ దర్శకత్వం వహించారు. సినిమా చాలా బాగా తీశారు. ఈ సినిమాలో ఎంత మంది కెమెరామెన్లు ఉండేవారో మాకు అర్థం అయ్యేది కాదు. చాలా మంది కో డైరెక్టర్లు పనిచేశారు. షూటింగులో నాలుగైదు యూనిట్లు ఉండేవి. ఇటు పరుగెత్తాలి ఒక షాటు, అటు పరుగెత్తాలి ఒక షాటు. అరేయ్ ఇటు రారా వేణు అనేవారు రాజేంద్రప్రసాద్ గారు, ఇంకొకరిని అరెయ్ మీరు ఇటు రండిరా అనేవారు. అందరూ ఫ్రేములో కనబడుతున్నారా? లేదా? అని ఆయనకంటే ముందు పక్కనున్నవారిని చూసుకునేవారు. ఎవరైనా ఫ్రేములో కనబడకపోతే నువ్వు కనబడట్లేదురా అంటూ చొరవతీసుకునేవారు. మమ్మల్ని అందరినీ దగ్గరుండి చూసుకున్నారు. రాజేంద్రప్రసాద్ గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.... అని వేణు మాధవ్ వ్యాఖ్యానించారు.

    80 మందితో కేక పెట్టించే ఫన్

    80 మందితో కేక పెట్టించే ఫన్

    80 నటులతో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని ఎంటర్టెన్మెంట్ సినిమాల కంటే ఇది అద్భుతమైన ఎంటర్టెన్మెంట్ మూవీ అవుతుంది... అని వేణు మాధవ్ తెలిపారు.

    ఇక్కడ పోస్టర్లో నా ఫోటో లేదు

    ఇక్కడ పోస్టర్లో నా ఫోటో లేదు

    ఏ ఫ్రేములో ఎవరు వచ్చి ఎవరు పోయారో తెలియదు. ఎంతలా అంటే... ఇక్కడ(ప్రెస్ మీట్లో) పోస్టర్ మీద నా ఫోటో కూడాలేదు. నా ఒక్కడి ఫోటోనే కాదు చాలా మంది ఫోటోలు లేవు. అందుకే పోస్టర్లో ట్రాక్టర్లు, లారీలు, జీపులు పెట్టారు. ఆ జీపులోనో, ఆ ఆటోలోనో ఎక్కడో నేను ఉండి ఉంటాను. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా ఉండి ఉంటారు.... అని వేణు మాధవ్ అన్నారు.

    దర్శకుడు నరకం చూపించాడు

    దర్శకుడు నరకం చూపించాడు

    దర్శకుడు ఈ సినిమా షూటింగ్ కోసం చాలా కష్టపెట్టాడు. లారీల్లో ఎక్కించారు. ట్రాక్టర్లలో ఎక్కించారు. ఒకరకంగా కాదు మాకు నరకం చూపించాడు. చివరకు రాజేంద్ర ప్రసాద్ గారితో బస్సు కూడా నడిపించారు. ఇది విచిత్రమైన సినిమా. ఒక సెకన్ కూడా ఎవరూ ఎంటర్టెన్మెంట్ లేకుండా బయటకు వెళ్లరు. అలాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది... అని వేణు మాధవ్ తెలిపారు.

    ఐటం సాంగు కూడా హీరోయినే చేసింది

    ఐటం సాంగు కూడా హీరోయినే చేసింది

    ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో తప్పకుండా ఓ ఐటం గర్ల్, ఐటం సాంగ్ ఉంటుంది. ఈ సినిమాలో ఐటం సాంగ్స్ లేవు. హీరోయిన్లే అన్నీ కలిపి చేశారు. మీకు ఎలాంటి ఎంటర్టెన్మెంట్ కావాలో అలాంటి ఎంటర్టెన్మెంట్ లభిస్తుంది. పక్తు నవ్వుకునే సినిమా. మేము పెట్టిన డబ్బులకు న్యాయం జరిగింది అని ప్రేక్షకులు ఫీలవుతారు. మార్చిలో ఈ సినిమా వస్తోంది.... అని వేణు మాధవ్ తెలిపారు.

    తనతో షూటింగ్ చాలా కష్టం

    తనతో షూటింగ్ చాలా కష్టం

    రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.... ఇప్పుడున్న నిర్మాతల మాదిరిగా కాకుండా విక్రమ్ సినిమాను బాగా తీశాడు. సాధారణంగా సినిమాలు తీసేవాళ్ళలో రెండు రకాలు ఉంటారు. కడుపులో నీళ్లు కదలకుండా హ్యాపీగా సినిమా తీసేవాళ్ళు ఒకరు. ఎన్ని కష్టాలైనా పడి ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనుకునేవాళ్ళు ఇంకొకరు. నిధి ప్రసాద్ తనను తాను కాంప్లికేటెడ్ చేసుకుని ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనుకుంటాడు. తనతో షూటింగ్ అంటే కష్టం... అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

    షూటింగ్ జరిగినంత సేపు తిట్టుకుని

    షూటింగ్ జరిగినంత సేపు తిట్టుకుని

    నిధి ప్రసాద్‌తో సినిమా చాలా కష్టం. ఈ సినిమాలో బోలెడు మంది ఆర్టిస్టులున్నారు. తనతో షూటింగ్ జరిగినంత సేపు తిట్టుకుని, విడుదల తర్వాత హ్యాపీగా ఫీలయ్యే వాళ్లలో నేనూ ఒకణ్ణి. అంతకు ముందు అతనితో 'అందరూ దొంగలే', 'మైఖేల్ మదన్ కామరాజు', 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' చేశా... అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

    Recommended Video

    వాళ్ళకోసమే గుండు కొట్టించుకున్నా
    ఇంతమంది ఆర్టిస్టులతో సినిమా తీయడం చాలా కష్టం

    ఇంతమంది ఆర్టిస్టులతో సినిమా తీయడం చాలా కష్టం

    కామెడీ అఫ్ ఎర్రర్స్ తో రూపొందింది. నేను భారీ బడ్జెట్ సినిమాలు చాలా చేశా. బడ్జెట్ కన్నా ఇంతమంది ఆర్టిస్టులతో సినిమా తీయడం చాలా కష్టం. ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే సినిమా. వందశాతం ప్రేక్షకుల డబ్బుకి వినోదం అందిస్తుంది.. అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

    English summary
    Comedian Venu Madhav interesting comments about Rajendra Prasad Behavior On Sets of U.Pe.Ku.Ha. The movie directed by Nidhi Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X