twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉదయ్ కిరణ్ మృతి: వారి వల్లే అంటూ హెచ్చార్సీలో ఫిర్యాదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినీ పరిశ్రమలో కొందరు పెద్దలు వల్లే ఉదయ్ కిరణ్ మృతి చెందారంటూ హెచ్చార్సీలో కంప్లైంట్ నమోదైంది. న్యాయవాది అరుణ్ కుమార్ ఈ విషయమై ఫిర్యాదు చేస్తూ ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసారు. నలుగురు కంబంధ హస్తాల వల్లే చిన్న హీరోలు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్ేనారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెర వెనక జరుగుతున్న తతంగాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఆయన హెచ్చార్సీ ని కోరారు. అలాగే తనకు ఉదయ్ కిరణ్ వ్యక్తిగత పరిచయం లేదని, ఓ సినీ అభిమానిగా మాత్రమే హెచ్చార్సీ లో పిర్యాదు చేసారని న్యాయవాది అరుణ్ అన్నారు.

    ఉదయకిరణ్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అపోలో నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శ్రీనగర్‌కాలనీలోని ఆయన నివాసానికి తరలిస్తారు. ఆదివారం అర్థరాత్రి హీరో ఉదయ్‌కిరణ్‌ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందిన సంగతి తెలిసిందే.

    హీరో ఉదయ్‌కిరణ్‌ ఉరివేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ కృష్ణ పోలీసులకు తెలిపాడు. ఉదయ్‌కిరణ్‌ భార్య రాత్రి 8 గంటల సమయంలో ఓ వేడుకలో పాల్గొనేందుకు బయటకు వెళ్లారని చెప్పాడు. రాత్రి ఒంటిగంట సమయంలో భార్య, అత్తమామలు హడావిడిగా ఇంటికి చేరుకున్నారని... అనంతరం అరుపులు విన్పించాయని వివరించారు. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించామన్నారు.

    సినిమా అవకాశాలు లేవని ఉదయ్‌కిరణ్‌ తనతో బాధ వ్యక్తం చేశారని.. తాను నచ్చజెప్పానని భార్య విషిత పోలీసులకు తెలిపారు. గత రెండ్రోజులుగా నిరాశతో ఉన్నారని చెప్పారు. బంధువుల పుట్టినరోజు వేడుకకు ఇద్దరం వెళ్లాల్సి ఉందని కానీ ఆయన రానన్నాడని చెప్పారు. వేడుకల్లో ఉండగా ఉదయ్‌కిరణ్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ వచ్చిందని వివరించారు.

    English summary
    Police are investigating Uday Kiran's death. Banjara Hills Police filed Uday Kiran’s case as 'suspicious death'. "Not murder but we have filed the case as suspicious death. We will investigate thoroughly and will check whether his death was happened by hanging with postmortem report," said Satyanarayana, Deputy Commissioner of Police, Banjara Hills, Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X