ఉదయ్ కిరణ్ సోదరుడిది కూడా ఆత్మహత్యే, కుటుంబ పరంగా సమస్యలతో సతమతం

By Bojja Kumar

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఉదయ్ కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే పలు నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎప్పుడు చూసినా పైకి చిరునవ్వుతో కనిపించే ఉదయ్ కిరణ్.......తన మనసులో ఎంత మనోవేదన దాచుకున్నాడో ఆయన కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే స్పష్టం అవుతుంది.

ఉయద్ కిరణ్ తల్లి చాలా ఏళ్ల క్రితమే మరణించింది. ఉదయ్ కిరణ్‌కి పదేళ్ల వయసు ఉన్నపుడు అతని సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ వైపు తల్లిలేని లోటు.....మరో వైపు సోదరుడి మరణం ఉదయ్ కిరణ్‌‌‌‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. సినిమాల్లోకి వచ్చిన కొన్నాళ్లు బాగానే ఉన్నా....ఆ తర్వాత కెరీర్ గాడితప్పింది.

Uday Kiran

కెరీర్ సమస్యలకు తోడు....ఇంట్లో తండ్రి వివికె మూర్తితో గొడవలు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంటి నుండి బయటకు వచ్చిన ఉదయ్ కిరణ్ కొంత కాలం ఒంటరిగా జీవించాడు. ఆ తర్వాత విషితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లికి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. ఉదయ్ తనకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడని తండ్రి చెబుతున్నాడు.

కొన్నాళ్లుగా ఉదయ్ కిరణ్ తన భార్య విషిత, అత్తమామలతో కలిసి ఉంటున్నాడు. ఉదయ్ కిరణ్ అక్కయ్య శ్రీదేవి, బావ ఓమన్లో ఉంటున్నారు. ఉదయ్ కిరణ్ మరణవార్త తెలుసుకుని వారు ఇండియా బల్దేరినట్లు తెలుస్తోంది. తన కూతురు వచ్చాకే ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని చూడటానికి వెళతానని తండ్రి చెబుతుండం గమనార్హం. దీన్ని బట్టి ఉదయ్ కిరణ్ కుటుంబ పరంగా ఎంత సఫర్ అవుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఇలా....ఓ వైపు కుటుంబ పరంగా మనశ్శాంతి లేక పోవడం, మరో వైపు సినిమా కెరీర్ గాడి తప్పడం లాంటి పరిణామాలతో ఉదయ్ కిరణ్ సతమతం అయ్యాడు. బహుషా ఇలాంటి పరిస్థితులే ఆయన్ను ఆత్మహత్య వైపు నడిపించాయని అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఒక మంచి నటుడుడిని కోల్పోవడం తెలుగు సినిమా ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X