twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు పూర్తి, వ్యతిరేకంగా నినాదాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ అంత్య క్రియలు మంగళవారం ఎర్రగడ్డలోని స్మశాసన వాటికలో ముగిసాయి. ఉదయ్ కిరణ్ తండ్రి వివికె మూర్తి ఆయన చితికి నిప్పటించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు హాజయ్యారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

    ఈ సందర్భంగా కొందరు ఉదయ్ కిరణ్ అభిమానులు....ఓ వ్యక్తికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన సదరు వ్యక్తి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన వల్లే ఉదయ్ కిరణ్ కెరీర్ డౌన్ అయిందని అభిమానులు అనుమానిస్తున్నారు.

     Uday Kiran

    అంతకు ముందు ఉదయ్ కిరణ్ మృతదేహం సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్లో ఉంచారు. దాసరి నారాయణరావు, రామానాయుడు, తనికెళ్ల భరణి, వెంకటేష్, సురేష్ బాబు, సునీల్, వరుణ్ సందేశ్, అలీ, జయసుద, పరుచూరి బ్రదర్స్, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు సందర్శించారు.

    ఉదయ్ కిరణ్ ఆత్మహత్య విషయమై వెస్ట్ జోన్ డీసీపీ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ....టీం ఆఫ్ డాక్టర్స్ ఉదయ్ కిరణ్‌ది ఆత్మహత్యే అని ప్రాథమికంగా తేల్చారని తెలిపారు. ఉరి వేసుకోవడం ద్వారా మరణించినట్లు తేలిందన్నారు. తాము పూర్తి స్థాయి నివేదిక పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.

    ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తమకు తెలిసిన వివరాల ప్రకారం అవకాశాలు లేక పోవడం, గౌరవం లేక పోవడం, ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా అప్పటికప్పుడు అంత త్వరగా ఆత్మహత్య చేసుకోవడానికి గల బలమైన కారణమేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

    English summary
    Actor Uday Kiran funeral held at Erragadda Cremation Grounds. Depression and financial problems might have forced the 33-year-old actor to take this serious step.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X