»   » ‘ఉద్దానం’ అనాథలను దత్తత తీసుకొన్న జనసేవకులు.. పవన్ కల్యాణ్ పాదాభివందనం..

‘ఉద్దానం’ అనాథలను దత్తత తీసుకొన్న జనసేవకులు.. పవన్ కల్యాణ్ పాదాభివందనం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత కొద్దికాలంగా ఉద్యమిస్తున్నారు. పవన్ దీక్ష నేపథ్యంలోనే ఉద్దానం సమస్యను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కిడ్నీ సమస్యపై పరిశోధన చేపట్టడానికి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి పలువురు వైద్య నిపుణులు వచ్చారు. ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి తన వంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన సీనియర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌కు ఆయన పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైంది.

కిడ్నీ సమస్యపై చర్చించేందుకు పవన్..

కిడ్నీ సమస్యపై చర్చించేందుకు పవన్..

కిడ్నీ వ్యాధిగ్రస్ధుల సమస్యలపై చర్చించే నిమిత్తం సోమవారం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. కిడ్నీ వ్యాధిగ్రస్ధుల సమస్యలపై చర్చించే నిమిత్తం హార్వర్డ్‌ నుంచి వచ్చిన మరో తెలుగు డాక్టర్‌ వెంకట్‌ సుబ్బిశెట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన పరిశోధనలు ఉద్దానం ప్రజలకు రక్షణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

Pawan Kalyan wrote a letter to Party Cadre
వాతావరణ కాలుష్యం వల్లనే..

వాతావరణ కాలుష్యం వల్లనే..

ఉద్దానం కిడ్నీ సమస్యలపై అధ్యయనం చేయడానికి హార్వర్డ్‌ నుంచి వచ్చిన డాక్టర్‌ జోసెఫ్‌ వి బోన్‌వెంట్రే మాట్లాడుతూ.. తాగునీటిలో లోహాల కాలుష్యం, మోతాదుకు మించిన ఎరువుల వినియోగం, జన్యుపరమైన లోపాలు తమ దృష్టికి వచ్చాయి అని వివరించారు. వాతావరణ కాలుష్యం కూడా కొంత కారణమని భావిస్తున్నాం. ఈ సమస్యలపై స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరముంది అని పేర్కొన్నారు.

పిలల్లే ఎక్కువగా బాధితులు

పిలల్లే ఎక్కువగా బాధితులు

20 ఏళ్లలోపు పిల్లలే ఎక్కువగా కిడ్నీ వ్యాధులకు గురువుతున్నట్లు గమనించాను. మా పరిశోధనలో ఏడుగురు మహిళలు కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నట్లు తేలింది. ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు పరిష్కారం చూపాలంటే కిడ్నీ రీసెర్చ్‌ అండ్‌ కేర్‌ సెంటర్‌ ఒకటి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. బయో బ్యాంకింగ్‌, కిడ్నీ మార్పిడి వంటి సౌకర్యాలు కల్పించాలి అని బోన్‌వెంట్రే తెలిపారు.

ఉద్దానం బాధితులను జనసేన దత్తత

ఉద్దానం బాధితులను జనసేన దత్తత

ఉద్దానం సమస్యపై జనసేన పార్టీ తీవ్రమైన పోరాటం చేస్తున్నది. కిడ్నీ సమస్య కారణంగా తల్లిదండ్రులు చనిపోగా అనాథలైన ఇద్దరు బాలలను జనసేన సభ్యులు దత్తత తీసుకున్నారు. జనసేవకులు స్పందించిన తీరును పవన్‌కల్యాణ్‌ అభినందించారు. జనసేవకులు మరింత సేవాభావంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.

English summary
Pawan Kalyan mets Professors and researchers from Harvard University, Who is conducting a field study and tour Andhra Pradesh's Uddhanam region in Srikakulam district. Pawan Kalyan attended a meeting that conducted in AP state. In this occassion, Pawan Kalyan touch the feet of Doctor Chandra sekhar is representing the doctors team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu