»   » ఉడ్తా PM కి సమాధానం చెప్పిన అనురాగ్ కాశ్యప్

ఉడ్తా PM కి సమాధానం చెప్పిన అనురాగ్ కాశ్యప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పంజాబ్ లో ని డ్రగ్ మాఫియా నేపథ్యం లో తెరకెక్కిన సినిమా ఉడ్తా పంజాబ్ నెమ్మదిగా రాజకీయ రంగు పులుము కుంటోంది. సినిమాలో అశ్లీల దృశ్యాలూ, సంభాషణలూ ఉన్నాయన్న కారణం తో సెన్సార్ బోర్డ్ 40 కి పైగా కత్తెరలు వేయటం తో కలత పడ్డ అనురాగ్ కాశ్యప్ "రివైజ్డ్ కమిటీ" ని ఆశ్రయించాడు.

కానీ అక్కడ అనురాగ్ కి ఊహించని విధంగా ఎదురు దెబ్బతగిలింది. సెన్సార్ వాళ్ళు మరీ ఉదారంగా వ్యవహరించారు అంటూ ఈ సారి ఏకంగా 89 సెన్సార్ కట్లు వేయటం తో మరింత కష్టాల్లో పడింది ఉడ్తా పంజాబ్. పనిలో పని గా తమ రాష్ట్రం లో ని డ్రగ్ మాఫియాని బేస్ చేసుకుని ఈ సినిమాని నిర్మించారని అది తమ ప్రతిష్టకి భంగం అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఉడ్తా పంజాబ్ ని తమ రాష్ట్రం లో ప్రదర్శించకుండా ఉత్తర్వులిచ్చింది.

ta punjab

అయితే ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరి జాతీయ రాజకీయాల జోక్యం తో ఇప్పుడు కీలకం గా మారింది... సోషల్ మీడియాలో కూడా ఉడ్తా పంజాబ్ కి మద్దతుగా సెన్సార్ బోర్డు మీదా, కేంద్ర ప్రభుత్వం మీదా సెటైర్లు మొదలయ్యాయి... సంస్కారీ సెన్సార్, ఉడ్తా పీయెం పేరుతో హ్యాష్ ట్యాగ్ లు కూడా మొదలయ్యాయి...

సెన్సార్ బోర్డు తీరుపై గత ఏడాదిగా తీవ్ర స్థాయిలో వివాదాలు నడుస్తున్నాయి. ప్రహ్లాద్ నిహ్లాని సెన్సార్ బోర్డు ఛైర్మన్ అయ్యాక కావాలనే కొర్రీలు వేసి సినిమాలకు అడ్డం పడుతున్నాడని.. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో "ఉడ్తా పంజాబ్" వివాదం బాగా పెద్దది కావడంతో దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొన్ని ప్రతి పక్ష పార్టీలు కూడా రెడీ అయిపోయాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ సహా కొన్ని పార్టీలు కశ్యప్‌కు మద్దతు ప్రకటించాయి.

అయితే ఇప్పుదు తాజాగా అనురాగ్ అందరికీ ఒక షాక్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి తన విధేయతని ప్రకటించుకున్నాడు. "ఇప్పుడు కాదు యూపీయే ప్రభుత్వం లో నేను ఎక్కువ సమస్యలే ఎదుర్కొన్నాను ఈ వివాదాన్ని నన్నే పరిష్కరించుకోనివ్వండి" అంటూ షాక్ ఇచ్చాడు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం.

పెద్ద ట్విస్టు ఏంటంటే. తమకు మద్దతుగా నిలుస్తున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పార్టీ ఆదేశాల మేరకు ఒక గ్యాంగ్ అదే పనిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తనను ఆ పార్టీ ఏజెంట్ లాగా ప్రెజెంట్ చేయడానికి ఈ ఇష్యూ నుంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తోందని వెల్లడించాడు కశ్యప్.

తన పోరాటమేదో తాను చేసుకుంటానని.. మీ పని మీరు చూసుకోండని కశ్యప్ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చాడు. "ఉడ్తా పంజాబ్" గొడవ నేపత్యంలో నిన్నట్నుంచి "ఉడ్తా పీఎం" పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ హల్ చల్ చేస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ పనిగా అనుమానిస్తున్నారు. తాజాగా కశ్యప్ చేసిన వ్యాఖ్యలతో అది వాస్తవమే అని తేలిపోయింది.

English summary
Anurag Kashyap reminds aap and congress to stay away from his war on "Udta Punjab" with censor..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu