»   »  రిలీజ్ కు ముందే పూర్తి సినిమా లీక్, ఎవరిపై డౌటో తెలిస్తే షాక్ , సినిమా కథేంటి?

రిలీజ్ కు ముందే పూర్తి సినిమా లీక్, ఎవరిపై డౌటో తెలిస్తే షాక్ , సినిమా కథేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : రిలీజ్ కు ముందే టోరెంట్ సైట్లలో సినిమా ప్రత్యక్ష్యమైతే చేసేదేముంది. ఇప్పుడు వివాదాస్పద బాలీవుడ్ చిత్రం ఉడ్తా పంజాబ్ కి అదే సమస్య ఎదురైంది. విడుదలకు చట్టపరంగా అడ్డంకులైతే తొలిగాయి కానీ రకరకాల సమస్యలనుంచి మాత్రం చుట్టుముడుతున్నాయి.
సెన్సార్‌ చిక్కుల నుంచి బయట పడటంతో ఊపిరిపీల్చుకునే లోపే టోరెంట్ సైట్లలో సినిమా లీక్ కావడంతో తలపట్టుకున్నారు నిర్మాతలు. అయితే లీకైన సినిమా ప్రింట్లపై 'ఫర్ సెన్సార్' అనే ముద్ర ఉండటమే ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది. దాంతో ఈ సినిమా లీక్ అవటానికి కారణం... సెన్సార్‌ వారే కావచ్చన్న డౌట్ అందరూ వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా లీక్ ప్రింట్లపై సెన్సార్ డేట్ స్టాంప్ ఉండటంతో తాము సెన్సార్‌కు ఇచ్చిన ప్రింటే యథాతథంగా లీక్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు గంటల ఇరవై నిముషాలు నిడివి ఉన్న ఈ సినిమా లీక్ కావటంతో యూనిట్ కు ఇప్పుడు ఆ టోరెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికిపట్టుకోవాల్సిన పనిలో పడ్డారు.

అయితే లోపాయికారిగా... ఈ లీకేజ్ వ్యవహారం సెన్సార్ పనే అని అధికారికంగా చెప్పేందుకు మాత్రం చిత్ర యూనిట్ ముందుకురావటంలేదు. చెప్పి కొత్త సమస్యల్లో ఇరుక్కోవటం ఎందుకని టీమ్ భావిస్తోంది. ఏదైమైనా తక్షణ కర్తవ్యం..టోరెంట్స్ డిలేట్ చేయటం, థియేటర్ల వద్దకు సినిమాను సేఫ్‌గా తీసుకెళ్లడమే.

ఈ సినిమాలో ..షాహిద్‌ విభిన్నమైన హెయిర్‌ స్టైల్స్‌తో కనిపించనున్నాడు. ఒంటిపై 14 రకాలు టాటూలు పొడిపించుకున్నాడు. ఆలియా భట్‌ పూర్తి స్థాయి డీ గ్లామర్‌ పాత్రలో కనిపిస్తుంది. బిహారీ, పంజాబీ కలగలిపిన యాసలో మాట్లాడేందుకు శిక్షణ తీసుకుంది. ఇక కరీనా కపూర్‌ కాటుక తప్ప పెద్దగా మేకప్‌ వేసుకోలేదట. స్థానిక దుకాణాల్లో దొరికే సల్వార్‌ కుర్తాలనే వేసుకుందట. పంజాబీ స్టార్‌ దిల్జిత్‌ దొసాంజ్‌ ఈ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు.

ఇక ఈ చిత్రం కథేంటి... స్లైడ్ షోలో చూడండి...

డ్రగ్స్ చుట్టూ తిరిగుతుంది..

డ్రగ్స్ చుట్టూ తిరిగుతుంది..

డ్రగ్స్‌ చుట్టూ తిరిగిన ఈ నలుగురి జీవితాలు ఏ దరికి చేరాయన్నది ‘ఉడ్తా పంజాబ్‌' కథాంశం. పంజాబ్‌లో డ్రగ్స్‌ తో నాశనమవుతున్న యూత్ జీవితాలను కళ్లకు కట్టిన చిత్రమిది. ఆ నాలుగు పాత్రలు ఎవరంటే..

షాహిద్ కపూర్ క్యారక్టర్..

షాహిద్ కపూర్ క్యారక్టర్..

ఇందులో షాహిద్ కపూర్ క్యారక్టర్ పేరు...టామీ సింగ్‌ . అతని పేరు చెబితే పంజాబీ యూత్ ఉర్రూతలూగిపోతుంది. తన పాటలతోనే కాదు చిత్రవిచిత్రమైన ఫ్యాషన్లతో యూత్ కు నచ్చిన రాక్‌ స్టార్‌. అయితే డ్రగ్స్‌. కొకైన్‌ కైపు లేనిదే టామీ సింగ్‌ షో చేయలేడు. వాటి కోసం ఎంత డబ్బు వెదజల్లడానికైనా సిద్ధమే.

అలియా భట్..

అలియా భట్..

అలియా భట్ పాత్ర పేరు...పింకీ... బిహార్‌ నుంచి పంజాబ్‌కు వలసొచ్చిన పేద అమ్మాయి. హాకీ స్టిక్‌ పట్టుకుంటే తనకు ఆకలి కూడా గుర్తుకురాదు. హకీ క్రీడాకారిణిగా తన పేరు దేశం మొత్తం తెలియాన్నది ఆమె కోరిక ఆమెది. హాకీ క్రీడాకారిణి కావాలన్న పింకీ కలను నాశనం చేసిందీ డ్రగ్సే.

కరీనాకపూర్ పాత్ర

కరీనాకపూర్ పాత్ర

ప్రీత్‌ సహానీ గా కరీనా కపూర్ కనిపిస్తుంది.ఆమె లండన్‌లో పేరున్న వైద్యురాలు. లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితం. అన్నీ వదిలేసి హఠాత్తుగా ఇండియా వచ్చేసింది. అమృత్‌సర్‌లో ఓ చిన్న క్లినిక్‌ మొదలెట్టింది. ఆమె నిర్ణయం వెనుక ఓ విషాదముంది. ఈమెకు ఈ డ్రగ్స్ తో ఓ లింక్ ఉంది, అదేంటంటే...

లవర్ డ్రగ్స్ తో చనిపోతే..

లవర్ డ్రగ్స్ తో చనిపోతే..

ప్రీత్‌ సహానీ జీవితంలో విషాదానికి కారణం మాదకద్రవ్యాలే. ఆమె లవర్ డ్రగ్స్‌కు బానిసై చనిపోతాడు. దీంతో ఆమె మాదకద్రవ్యాల వ్యసనపరుల్లో మానసిక పరివర్తన తీసుకురావడానికి పూనుకుంటుంది.

 దిల్జిత్‌ దొసాంజ్‌

దిల్జిత్‌ దొసాంజ్‌

పంజాబీ స్టార్‌ దిల్జిత్‌ దొసాంజ్‌ ఈ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. అతని పాత్ర పేరు సర్తాజ్‌ సింగ్‌. సర్తార్ నిఖార్సైన పోలీస్‌ అధికారి. వృత్తి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడు.

రహస్య మిషన్

రహస్య మిషన్


సర్తాజ్‌ సింగ్ ప్రాణాలకు తెగించి ఓ రహస్య మిషన్‌ చేపట్టాడు. సర్తాజ్‌ సింగ్‌ చేపట్టిన మిషన్‌ మాదక ద్రవ్యాల ముఠాల పనిపట్టడం.

ఏకైక రిలేషన్..

ఏకైక రిలేషన్..

ఈ నలుగురికీ ఒకరితో ఒకరికి సంబంధంలేదు. కానీ నలుగురికీ సంబంధమున్న విషయం... డ్రగ్స్‌.

కట్స్...

కట్స్...

సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి 94 కట్స్‌ విధించింది. ఐతే న్యాయస్థానం ఒక్క కట్‌తోనే విడుదలకు అనుమతించింది.

మూత్ర విసర్జన..

మూత్ర విసర్జన..

షాహిద్‌ కపూర్‌ మూత్ర విసర్జన చేసే సన్నివేశాన్ని తొలగించారు.

సీన్స్ లేవు

సీన్స్ లేవుమాజీ ప్రేమికులు షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ తెరను పంచుకున్న చిత్రమిది. కానీ సినిమాలో వారిద్దరూ కలసి నటించిన సన్నివేశాలు లేవని సమాచారం.

ఎవరెవరు...

ఎవరెవరు...

అనురాగ్‌ కశ్యప్‌, ఏక్తా కపూర్‌ నిర్మించిన చిత్రానికి అభిషేక్‌ చౌబే దర్శకత్వం వహించారు. షాహిద్‌ కపూర్‌ (టామీ సింగ్‌), ఆలియా భట్‌ (పింకీ), కరీనా కపూర్‌ (ప్రీత్‌ సహానీ), దిల్జిత్‌ దొసాంజ్‌(సర్తాజ్‌ సింగ్‌)నటించారు.

English summary
Udta Punjab has been leaked online, just days before its scheduled theatrical release on 17 June. A senior police official at the cyber crime police station at BKC, Bandra confirmed that the film’s director, Abhishek Chaubey, had given a written request to the police to look into the matter three days ago. An FIR was lodged on Wednesday at the police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu