»   » ప్రేక్షకులపైనే మూత్ర విసర్జన చేసే హీరో...(ట్రైలర్ షాకింగ్)

ప్రేక్షకులపైనే మూత్ర విసర్జన చేసే హీరో...(ట్రైలర్ షాకింగ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: షాహిద్‌ కపూర్‌, అలియా భట్‌, కరీనాకపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'ఉడ్తా పంజాబ్'. అభిషేక్‌ చౌబే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి సంబందించి అఫీషియల్ ట్రైలర్ ఇటీవల విడుదల చేసారు. పంజాబ్‌లో తీవ్రమైన డ్రగ్స్ సమస్యను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 70 శాతం మంది పంజాబ్ యువత డ్రగ్స్ కు బానిసయ్యారు. ఇది ఇలానే కొనసాగితే పంజాబ్ మరో మెక్సికో అవుతుంది అనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

పంజాబ్‌లో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా, అక్రమ రవాణా లాంటి అంశాలను ఈ సినిమాలో ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఫాంటమ్‌ ఫిలింస్‌, బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న రాక్ స్టార్ గా సాహిద్ కపూర్, బిహారీ శరణార్దురాలి పాత్రలో అలియా భట్, డాక్టర్ పాత్రలో కరీనా కపూర్, పోలీస్ అధికారి పాత్రలో దల్జిత్ దోసంజా కనిపించారు.

ఈ చిత్రంలో షాహిద్ కపూర్ టామీ సింగ్ అనే రాక్ స్టార్ పాత్రలో నటిస్తున్నాడు. డ్రగ్స్ కు బానిసైన టామీ సింగ్... ఓ షోలో ప్రేక్షకులపైనే మూత్ర విసర్జన చేసే సీన్ ట్రైలర్లో చూపెట్టారు. పంజాబ్ యువతలో డ్రగ్స్ ప్రభావం ఎలా ఉందో అద్దం పెట్టేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి బాలీవుడ్ ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రంలో నటించిన నటీనటులంతా కెరీర్‌లో ఓ మెట్టు పైకి ఎక్కినట్లేనని హృతిక్ రోషన్ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు. ఈ చిత్రంలో జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Official trailer of Udta Punjab Released. Directed by Abhishek Chaubey, starring Shahid Kapoor, Kareena Kapoor Khan, Alia Bhatt and Diljit Dosanjh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu