»   » జై లవకుశ సూపర్ హిట్: ఉమైర్ సంధూ సెన్సార్ రివ్యూ

జై లవకుశ సూపర్ హిట్: ఉమైర్ సంధూ సెన్సార్ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుధవారం జై లవకుశ సినిమా సెన్సార్ పూర్తయింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ తెలిపింది. అయితే సినిమా టాక్ ఏంటో, ఎలా ఉందో ఓ సెన్సార్ బోర్డ్ సభ్యుడు తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారి మూడు పాత్రల్లో నటిస్తున్న జై లవకుశ.. రివ్యూను సెన్సార్ బోర్డ్ సభ్యుడు ముందే చెప్పేశాడు.

ఉమైర్ సంధు

ఉమైర్ సంధు

దుబాయిలో ఉండే ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్‌బోర్డ్ సభ్యుడు అయిన ఉమైర్ సంధు.. జై లవకుశ సెన్సార్ టాక్ ఎలా ఉందో వెల్లడించారు. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పిన సమాచారం మేరకు.. జై లవకుశ మాస్ ఎంటర్‌టైనర్‌గా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందనీ, మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఇరగదీశారని ఆయన ట్వీట్ చేశాడు.


Mega Hero Tweet On "Jai Lava Kusa" Trailer |
జై లవకుశ టీజర్

జై లవకుశ టీజర్

గురువారం సాయంత్రం 5 గంటల 22 నిమిషాలకు సినిమా మొట్టమొదటి టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. జై లవకుశ టీజర్ గురించి దుబాయిలో ఉండే సినీ విశ్లేషకుడు, యూఏఈ, యూకే, ఇండియా మూవీస్ మార్కెటింగ్ నిపుణుడు, సెన్సార్‌బోర్డ్ సభ్యుడు అని చెప్పుకునే ఈ ఉమైర్ సంధూ అసలు నిజంగా అక్కడ సెన్సార్ సభ్యుడో కాదో ఖచ్చితంగా ఎవరికీ తెలీదు గానీ ఇతని మాటలకి మార్కెట్ లో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.


ప్రారంభం నుంచే అంచనాలు

ప్రారంభం నుంచే అంచనాలు

ఒకే సినిమా.. మూడు పాత్రలు.. అందులోనూ ఎన్టీఆర్ వంటి హీరో నటిస్తున్నాడని తెలియగానే విపరీతమైన హైప్. మూడింటిలో ఓ పాత్రకు విలన్ షేడ్ ఉంటుందని సినీవర్గాల ప్రచారంతో అభిమానుల్లో కోటి ఆశలు. సీనియర్ ఎన్టీఆర్ లాగానే విలన్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ కొత్త అర్థం చెప్తారా..? అని విశ్లేషణలు.. వెరసి బాబి దర్శకత్వంలో, కల్యాణ్‌రామ్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ‘జై లవకుశ' సినిమాకు ప్రారంభం నుంచే అంచనాలు మొదలయ్యాయి.


ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్

ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్

ఫస్ట్ కాపీని సెన్సార్ బోర్డు ఇప్పుడే చూసిందనీ, సినిమా బాగా వచ్చిందని, ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమన్నారు. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. 10వ తారీఖున విడుదలయిన ఈ సినిమా ట్రైలర్‌ను ఇప్పటికే కోటి మందికి పైగా చూశారు. తమన్నా ప్రత్యేక గీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.


పాజీటీవ్ వేవ్స్

పాజీటీవ్ వేవ్స్

జై లవకుశ సిన్మా ట్రైలర్ రిలీజ్ నుండి కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా సెన్సార్ బోర్డు సభ్యులు కూడా కామెంట్ చేశారనే ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ సిన్మా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 21న విడుదల అవుతున్నది. ఎన్టీఆర్ కూడా మాంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్ త్రీపాత్రిభినయం ఎట్లా ఉంటుందో. ఇప్పటికైతే పాజీటీవ్ వేవ్స్ ఉన్నాయి .English summary
"Censor Reports of #JaiLavaKusa is Outstanding ! As per Censor Board Members, JrNTR Steals the Show all the way ! A Mass Entertainer" Tweeted Umair Sandhu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu