»   » పూరి భార్య.... ఛార్మిని నిందిస్తోందా? తెరపైకి కొత్త రూమర్స్

పూరి భార్య.... ఛార్మిని నిందిస్తోందా? తెరపైకి కొత్త రూమర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ డ్రగ్స్ ఇష్యూలో దాదాపు 12 మందికిపైగా సెలబ్రిటీలకు నోటీసులు అందినా.... ఇందులో పూరి జగన్నాథ్ ఎక్కువ టార్గెట్ అవుతున్నారు. మీడియాలో ఆయన గురించే ఎక్కువ కథనాలు వస్తున్నాయి. పూరితో కాస్త క్లోజ్ రిలేషన్ షిప్ ఉన్న ఛార్మిపై కూడా రకరకాల ప్రచారం జరుగుతోంది.

పలు సినిమాలకు పూరీ, ఛార్మి కలిసి పని చేయడం..... ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలకు నిర్మాణ భాగస్వాములుగా ఉండటం కూడా ఇలాంటి వార్తలకు కారణం అయుండొచ్చు. అయితే తాజాగా పూరి భార్య గురించి ఫిల్మ్ నగర్లో కొన్ని రూమర్స్ ప్రచారంలోకి రావడంతో అంతా షాకవుతున్నారు.

ఇది నిజమా? రూమరా?

ఇది నిజమా? రూమరా?

ఓ వైపు పూరి కేసు, మీడియాలో వార్తలతో ఆయన కుటుంబం చాలా బాధలో ఉంది. తన గురించి మీడియాలో వార్తలు చూసి తన భార్య లావణ్య ఎంతో బాధ పడిందని స్వయంగా పూరి చెప్పారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో...... ఛార్మి గురించి పూరి భార్య కామెంట్స్ చేసిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Puri Jagannadh Irritated With Enquiry Questions
ఛార్మినే కారణం అంటూ

ఛార్మినే కారణం అంటూ

పూరి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడానికి ఛార్మినే కారణమని.... పరామర్శించడానికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దల వద్ద లావణ్య వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

ఛార్మి సావాసం వల్లే

ఛార్మి సావాసం వల్లే

ఛార్మితో పని చేయడం తన భర్తకు కలిసి రాలేదని.... ఫెయిల్యూర్స్, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని లావణ్య వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం నమ్మశక్యంగా లేదని ఎవరో కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నట్లు అనిపిస్తోందని పూరి సన్నిహితులు అంటున్నారు.

ఛార్మి తండ్రి

ఛార్మి తండ్రి

కాగా.... డ్రగ్స్ కేసులో చార్మికి కూడా నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఆమె జులై 26న విచారణకు హాజరు కానుంది. రెండు రోజుల క్రితం చార్మి తండ్రి స్పందించారు. తన కూతురుకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని దీప్ సింగ్ ఉప్పల్ అన్నారు. మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని చెప్పారు. 13 ఏళ్ల వయసులోనే చార్మి సినీ రంగప్రవేశం చేసిందని తెలిపారు. సినీ రంగంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందని పేర్కొన్నారు. తన కూతురు గురించి తనకు బాగా తెలుసు అన్నారు.

English summary
Unbelievable rumours about Puri Jagannath's wife. Film Nagar source said that Lavanya Puri blames Charmi regarding drugs case issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu