twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపీ వివాదం: ‘అజ్ఞాతవాసి’ చూసిన ఫ్రెంచి డైరెక్టర్, ట్విట్టర్లో షాకింగ్ కామెంట్స్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    ‘అజ్ఞాతవాసి’ చూసిన ఫ్రెంచి డైరెక్టర్.. ట్విట్టర్లో షాకింగ్ కామెంట్స్ !

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రంపై కాపీ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫ్రెంచ్ మూవీ 'లార్గోవించ్' చిత్రానికి కాపీ అనే ప్రచారం జరిగింది. 'లార్గో వించ్' చిత్రం బాలీవుడ్ రీమేక్ హక్కులు దక్కించుకున్న 'టి సిరీస్' సంస్థ ఈ వార్తలు విని కంగారు పడటం, 'అజ్ఞాతవాసి' చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపడం జరిగిందనే వార్తలు జాతీయ మీడియాలో సైతం వినిపించాయి.

     ‘అజ్ఞాతవాసి' సినిమా చూసిన ఫ్రెంచి డైరెక్టర్

    ‘అజ్ఞాతవాసి' సినిమా చూసిన ఫ్రెంచి డైరెక్టర్

    ఇండియన్ మీడియాలో ఈ వార్తలు విన్న ‘లార్గో వించ్' చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లే...... పారిస్‌లోని లీ బ్రాడీ మల్లీ ప్లెక్స్ థియేటర్లో ‘అజ్ఞాతవాసి' సినిమాకు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని మరీ సినిమా చూశారు. సినిమా చూసిన అనంతరం ఆయన ట్విట్టర్ ద్వారా సంచలన కామెంట్స్ చేశారు.

    గ్రేట్ అట్మాస్పియర్

    గ్రేట్ అట్మాస్పియర్

    ‘అజ్ఞాతవాసి' సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన జెరోమ్ సల్లే అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి చూసి షాకయ్యారు. అక్కడి వరకు వెళ్లిన తర్వాత కానీ ఆయనకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో?... గ్రేట్ అట్మాస్పియర్ అంటూ ట్వీట్ చేశారు.

     సినిమా నచ్చిందా?

    సినిమా నచ్చిందా?

    ‘అజ్ఞాతవాసి' సినిమా చూసిన అనంతరం జెరోమ్ సల్లే స్పందిస్తూ.... సినిమా బావుందని, తెరకెక్కించిన విధానం నచ్చిందని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

     దురదృష్ట వశాత్తూ కాపీనే...

    దురదృష్ట వశాత్తూ కాపీనే...

    సినిమా అంతా బాగానే ఉంది కానీ, దురదృష్ట వశాత్తు ఈ చిత్రం నేను తెరకెక్కించిన ‘లార్గోవించ్' చిత్రానికి చాలా దగ్గరి పోలికలతో ఉందని వెల్లడించారు. ఇలా వెల్లడించడం ద్వారా తన సినిమా మూలాన్ని కాపీ కొట్టారని చెప్పకనే చెప్పారు జెరోమ్ సల్లే.

     ఏం జరుగబోతోందో?

    ఏం జరుగబోతోందో?

    తన ‘లార్గోవించ్' చిత్రానికి చాలా దగ్గరి పోలికలతో ఉంది అని స్వయంగా దర్శకుడే వెల్లడించిన నేపథ్యంలో ఏం జరుగబోతోంది? ‘టి సిరీస్' సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

     సీన్ టు సీన్ కాపీ కాదు

    సీన్ టు సీన్ కాపీ కాదు

    జెరోమ్ సల్లే చెప్పిన వివరాల ప్రకారం ‘లార్గో వించ్' చిత్రానికి సీన్ టు సీన్ కాపీ ‘అజ్ఞాతవాసి' కాదని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఏమీ చేయలేరని, దీని మీద కాపీ రైట్ కేసు వేసే చాన్సే లేదని కొందరు అంటున్నారు.

     కెవియట్ తెచ్చుకున్న అజ్ఞాతవాసి నిర్మాత, నిజమేనా?

    కెవియట్ తెచ్చుకున్న అజ్ఞాతవాసి నిర్మాత, నిజమేనా?

    కాపీరైట్ వివాదం మరింత ముదిరితే సినిమా విడుదల ప్రమాదంలో పడిపోతుందనే భయం వల్లే ట్రైలర్ కట్ చేసి సిద్దంగా ఉంచినా లేటుగా విడుదల చేశారని, సినిమా విడుదల ముందే దాదాపు 14 కోర్టుల్లో కెవియట్ దాఖలు చేసి రిలీజుకు ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్మాత ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.

     సినిమా టాక్ ఎలా ఉంది?

    సినిమా టాక్ ఎలా ఉంది?

    బెరిఫిట్ షోల నుండి అందిన సమాచారం, ట్విట్టర్లో పలువురు చేస్తున్న కామెంట్లను బట్టి ‘అజ్ఞాతవాసి' సినిమా అంచనాలను అందుకోలేదని అంటున్నారు. అయితే అభిమానులు మాత్రం సూపర్ హిట్ అంటున్నారు. ఓవరాల్ గా అయితే సినిమాకు మిక్డ్స్ టాక్ వినిపిస్తోంది.

    English summary
    "Screening at #LeBrady tonight. Great atmosphere thanks to the audience. I could‘ve loved the movie but unfortunately the plot was too familiar. #LargoWinch #Agnyaathavaasi" Jérôme Salle tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X