»   » పెళ్లి రోజు స్పెషల్: ఐశ్వర్య-అభిషేక్..అరుదైన మ్యారేజ్ ఫోటోస్

పెళ్లి రోజు స్పెషల్: ఐశ్వర్య-అభిషేక్..అరుదైన మ్యారేజ్ ఫోటోస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ వివాహం జరిగి నేటితో 8 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వీరిద్దరికి సంబంధించిన అరుదైన పెళ్లి ఫోటోలను అభిమానుల కోసం ప్రజెంట్ చేయడాన్ని మించినది ఏముంటుంది?

ఐష్-అభి ధూమ్-2 సినిమాలో కలిసి నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరిగింది. డేటింగ్ చేయడం ప్రారంభించారు. వయసులో తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడిన ఐష్ ఏప్రిల్ 20, 2007న పెళ్లాడింది.

పెళ్లికి ముందే ఇద్దరూ పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అటాచ్మెంట్ పెరిగింది. ఆ అనుబంధమే ఇద్దరూ పెళ్లి వైపు అడుగులు వేసేలా చేసింది. ఐశ్వర్య వయసులో పెద్దదయినా వారి పెళ్లికి ఇవేమీ అడ్డు రాలేదు.

ఇద్దరి పండంటి కాపురానికి గుర్తుగా ‘ఆరాధ్య' జన్మించింది. ఎలాంటి కలతలు, గొడవలు లేకుండా గత ఎనిమిదేళ్లుగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ అనోన్య దాంపత్యం కొనసాగిస్తున్నారు. వారి పెళ్లికి సంబంధించిన

ఫోటోలు స్లైడ్ షోలో....

ఐష్-అభి

ఐష్-అభి


బాలీవుడ్లో జరిగిన అత్యంత ఖరీదైన వాహాల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ వివాహం కూడా ఒకటి.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్


తన కొడుకు, కొడలి వివాహం జరిగి అప్పుడే 8 ఏళ్లు గడిచి పోయాయంటే నమ్మలేక పోతున్నారు అమితాబ్ బచ్చన్.

గుర్రంపై అభిషేక్

గుర్రంపై అభిషేక్


వివాహ వేడుక సందర్భంగా గుర్రంపై వస్తూ అభివాదం చేస్తున్న అభిషేక్ బచ్చన్.

గ్రాండ్ వెడ్డింగ్

గ్రాండ్ వెడ్డింగ్


అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ వివాహం జరిగి నేటికి 8 ఏళ్లు పూర్తయింది. ఎంతో గ్రాండ్ గా వీరి వివాహ వేడుక జరిగింది.

ప్రపోజల్

ప్రపోజల్


మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గరు' సినిమా సమయంలో అభిషేక్ బచ్చన్ తన మనసులోని మాటను ఐశ్వర్యకు వెల్లడించారు. ఐశ్వర్య అతని ప్రపోజల్ కి ఓకే చెప్పింది. అలా వీరి ప్రేమకు జీజం పడింది.

వధువుగా ఐష్

వధువుగా ఐష్


వివాహ వేదిక వద్దకు వస్తూ ఐశ్వర్యరాయ్ ఇలా...., ఐశ్వర్యరాయ్ ఇప్పటికే నవ వధువులా అందంగా మెరిసి పోతుండటం గమనార్హం.

అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్


ఐశ్వర్యరాయ్ తన భార్యగా దొరకడం ఎంతో లక్కీగా ఫీలవుతుంటాడు అభిషేక్. దీన్ని బట్టి ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భర్త కోసం...

భర్త కోసం...


భర్త కోసం వంట నేర్చుకోవడంతో పాటు...ఎన్నో రుచికరమైన వంటలు అతనికి చేసి పెడుతుందట ఐష్.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్


ఐష్ తో తన ప్రేమ విషయాన్ని....అభిషేక్ బచ్చన్ తన తల్లిదండ్రులైన అమితాబ్-జయకు చెప్పగానే వెంటనే ఓకే చెప్పారట.

8 ఏళ్ల ప్రేమబంధం

8 ఏళ్ల ప్రేమబంధం


8 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా దాంపత్యం సాగిస్తూ....ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు ఐష్-అభి. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమబంధం ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎప్పుడూ బలహీన పడలేదు.

English summary
It's been 8 years since the Bollywood's 'IT' couple, Aishwarya Rai and Abhishek Bachchan entered wedlock. On their 8th anniversary, what can be better than seeing their unseen wedding pics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu