»   » అఖిల్, శ్రియా వివాహం : రంగం లోకి దిగిన ఉపాసన

అఖిల్, శ్రియా వివాహం : రంగం లోకి దిగిన ఉపాసన

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు కొద్ది నెల‌లుగా అక్కినేని నాగార్జున వార‌సుల వివాహల మ్యాట‌ర్ మీడియాలో జోరుగా ట్రెండ్ అయ్యింది. ఇప్ప‌టికే చైతు, అఖిల్‌కు వారి ఫియాన్సీల‌తో ఎంగేజ్‌మెంట్లు కూడా పూర్త‌య్యాయి. పెళ్లి డేట్లు కూడా క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టే అనుకున్నారు. వీరిద్ద‌రు ఓ ఇంటి వారు అవడ‌మే లేట్ అనుకుంటున్న టైంలో ఇప్పుడు పెద్ద బాంబు లాంటి వార్త పేలింది.

చైతూ-స‌మంత పెళ్లి వ్య‌వ‌హారం ఎలా ఉన్న‌ప్ప‌టికీ అఖిల్ తో జీవీకే రెడ్డి మ‌న‌వ‌రాలు వివాహం డైలామాలో ప‌డిన‌ట్టేన‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ పెళ్లి ఇరు వ‌ర్గాల పెద్ద‌ల అంగీకారంతో క్యాన్సిల్ అయిన‌ట్టే అన్న టాక్ ఒక్కసారి టాలీవుడ్ వర్గాలను కుదిపేసింది.

Upasana Enters into Akhil and Shriya Bhupal Marriage

అఖిల్‌ బ్రేకప్‌ గురించి అందరూ మాట్లాడుకుంటున్నా, మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చేస్తున్నా ఇరు కుటుంబాల్లో ఎవరూ స్పందించడం లేదు. అఖిల్‌ తల్లి అమల పలు ఈవెంట్లలో పాల్గొంటున్నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. తాజాగా ఈ వ్యవహారం గురించి మరో వార్త వినబడుతోంది. అఖిల్‌, శ్రీయల మధ్య విభేదాలను తొలగించేందుకు రామ్‌చరణ్‌ తేజ్‌ భార్య ఉపాసన రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి.

జీవీకే ఫ్యామిలీకి ఉపాసన కుటుంబానికి క్లోజ్‌ రిలేషన్‌షిప్‌ ఉంది. పైగా శ్రీయకు, ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్‌. అందుకే అఖిల్‌, శ్రీయల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉపాసన ప్రయత్నిస్తోందట. ఉపాసన రాయభారం ఫలించి, అఖిల్‌, శ్రీయ ఒక్కటవ్వాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

English summary
Upasana Kamineni is the Reason Behind Akhil and Shriya Bhupal reunion
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu