»   » చెర్రీకి సెట్ కావనే విమర్శలు, విడాకులు, పిల్లలు కనడం, చిరు 150పై... ఉపాసన స్పందన

చెర్రీకి సెట్ కావనే విమర్శలు, విడాకులు, పిల్లలు కనడం, చిరు 150పై... ఉపాసన స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.... తన బెస్ట్ ఫ్రెండ్ ఉపాసనను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారి వివాహం జరిగి నాలుగేళ్లు పూర్తయింది. ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు. అయితే వీరి వివాహం సమమంలో ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అందుకు కారణం ఉపాసన అప్పట్లో లావుగా ఉండటమే.

  తర్వాత కొన్నాళ్లకు ఉపాసన, రామ్ చరణ్ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తర్వాత రామ్ చరణ్ స్వయంగా వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేవని ఆ వార్తలు కొట్టిపారేసారు. మరో వైపు పెళ్లయి ఇన్నేళ్లయినా చెర్రీ-ఉపాసన దంపతులకు పిల్లలు లేరు. చెర్రీ మాకు బుల్లి మెగా వారసుడిని ఎప్పుడు ఇస్తాడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

  తాజాగా డైలాగ్ విత్ ప్రేమ అనే ఇంటర్వ్యూలో ఉపాసన పై అంశాలపై స్పందించారు. ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలతొ పాటు షాకయ్యే విషయాలు కూడా ఉన్నాయి.

  మీరు చెర్రీకి సరైన జోడీ కాదనే విమర్శపై

  మీరు చెర్రీకి సరైన జోడీ కాదనే విమర్శపై

  నిజమే.... అప్పుడు నేను లావుగా ఉండేదాన్ని. నేను చరణ్ కి సరిజోడికాదు అంటే సంతోష పడే విషయమే.. మా ఆయనకు చాలా మంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. వారంతా తనకు ది బెస్ట్ కావాలని కోరుకుంటున్నారనేగా, ఇది బాగుంది... దీన్ని ఒక పొగడ్తగానే తీసుకుంటా అంటూ ఉపాసన తనదైన రీతిలో స్పందించారు.

  విడాకుల వార్తలపై...

  విడాకుల వార్తలపై...

  మేము అందరిలాగే నార్మల్ కపుల్. బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో. అసలు మేము విడాకులు ఎందుకు తీసుకుంటాం. నిజంగా అలా అయితే బయటి ప్రపంచానికి చెప్పుకోగలిగే ధైర్యం ఉన్న మనుషులం. ఎవరేమైనా రాసుకోండి ఇప్పుడయితే దాని గురించి పట్టించుకోను అని ఉపాసన వ్యాఖ్యానించారు.

  ఇప్పట్లో పిల్లల్ని కనే ఆలోచన లేదు

  ఇప్పట్లో పిల్లల్ని కనే ఆలోచన లేదు

  నా బరువు తగ్గడానికి నేను చాలా సమయం వెచ్చించాను. మల్లీ ఇపుడు కూర్చుని బరువు పెరగదల్చుకోలేదు. మేము ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం. నాకు నిజంగా పిల్లలు కావాలనుకుంటే నా వెనక మొత్తం అపోలో ఉంది. నేను పిల్లల్ని కంటాను. కానీ అది మా వ్యక్తిగతం. అది తర్వాత ఉంటుంది. ఇది ప్రపంచం మొత్తం తెలియాలనుకోను. అది మా పర్సనల్. కొన్ని అలాగే పర్సనల్ గా ఉంచాలి. అలాగే ఉంచుతాను... అంటూ ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశ్యం లేదని చెప్పకనే చెప్పింది ఉపాసన.

  వేరు కాపురం పెడుతున్నారా?

  వేరు కాపురం పెడుతున్నారా?

  మీకు గర్భం, పిల్లలకు జన్మనివ్వడం అంటే భయమటకదా.. అనే ప్రశ్నకు ఉపాసన స్పందిస్తూ...అవును నాకు చాలా భయం. మళ్లీ బరువు పెరుగుతాను. అంతే కాదు... మా ఇల్లు కూడా ఇంకా సిద్ధంగా లేదు. ఇంకా నిర్మాణం జరుగుతుంది. అది కూడా కావాలి. నేను అన్నీ ఖశ్చితంగా ప్లాన్ చేసే మనిషిని. అన్ని పద్దతి ప్రకారం జరగాలి. అన్నీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చరణ్ నాతో కొన్ని రోజులు ఉండాలి. అన్నీ అలా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఉపాసన తెలిపారు. దీన్ని బట్టి చెర్రీ, ఉపాసన త్వరలో వేరే ఇంట్లో కాపురం పెడతారని స్పష్టమవుతోంది.

  నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి

  నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి

  మామయ్యగారు చాలా మంచి వ్యక్తి. అత్తయ్యగారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. చరణ్, తన కుటుంబం నాకు ఎంతో అండగా నిలిచారు. అందుకే వారికి కృతజ్ఞతల తగినంతగా చెప్పుకోవాలి. చరణ్ ఎప్పుడూ నా పక్కనే ఉంటూ తోడుగా ఉంటాడు. తన అసిస్టెంట్, డ్రైవర్... అందరూ కూడా నా గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. తలుచుకుంటే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.

  మీరు ఒకప్పుడు చాలా లావుగా ఉండేవారు, ఎవరైనా ఏడిపించేవారా? హేలన చేసేవారా?

  మీరు ఒకప్పుడు చాలా లావుగా ఉండేవారు, ఎవరైనా ఏడిపించేవారా? హేలన చేసేవారా?

  నేను బాగా లావున్నపుడు అమెరికాలో ఉండేదాన్ని. ఆ బరువు కూడా నన్ను నేను నియంత్రించుకోలేకపోవడం వల్ల వచ్చింది. కుటుంబానికి దూరంగా ఉండటం కారణంగా ఎక్కువగా తినేదాన్ని తర్వాత దాని నుండి బయట పడ్డాను. అపుడు నా వయసు 18, 19. నన్ను హేలన చేసే అవకాశం ఎవరికీ ఇవ్వను. నేనెప్పుడూ స్ట్రాంగ్ పర్సన్. ఏది నన్నెప్పుడూ భయపెట్టే అవకాశం ఇవ్వను. ఎందుకంటే నేను పెరిగింది అలాంటి విలువలతో. నా పెళ్లప్పుడు కూడా నేను చాలా మంది నేను లావుగా ఉన్నాను అన్నారు. అది నేను ఏ మాత్రం పట్టించుకోలేదు. అది కాస్త బాధించేలా ఉన్నా అది వారి అభిప్రాయమని ఉపాసన వ్యాఖ్యానించారు.

  పని, జీవితంపని, జీవితం

  పని, జీవితంపని, జీవితం

  స్త్రీలకయితే అది పని, జీవితం ఈ రెండింటి మధ్య సమతుల్యం ఉండాలి. రెండింటి మధ్య ఒక పరిధి ఉండాలి. రామ్ చరణ్ గురించి ఎలాంటి రూమర్ వచ్చినా పట్టించుకోను. నేను మా ఆయన్ను ప్రేమిస్తాను, తను నన్ను ప్రేమిస్తాడు అని ఉపాసన తెలిపారు.

  150వ సినిమా గురించి....

  150వ సినిమా గురించి....

  మామయ్యగారి 150వ సినిమా గురించి చరణ్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. సినిమా గురించి ఆయన సిద్ధంగా ఉన్నారంటే తన భార్యగా నేను కూడా కశ్చితంగా ఉన్నట్లే. కుటుంబంలో ఈ సినిమా గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన మళ్లీ యాక్షన్ లోకి రావడం అద్భుతం అనిపిస్తుంది.

  మామగారి గురించి ఉపాసన

  మామగారి గురించి ఉపాసన

  మామగారు చాలా జాలిగుండె కలిగిన వ్యక్తి. అంత సాధించినా కూడా ఎంతో జాలి కలిగి ఉన్న వ్యక్తి. చాలా మంచి మర్యాద ఉన్న వ్యక్తి. మా ఆయన కూడా అలానే తయారవుతున్నారు. తను చాలా కరుణ చూపించే వ్యక్తి.

  అదంటే అసహ్యం, టార్చర్

  అదంటే అసహ్యం, టార్చర్

  వ్యాయామం అంటే అసహ్యం నాకు, అదో పెద్ద టార్చర్ లాంటిది. చరణ్ రోజుకు రెండు మూడు సార్లు వ్యాయామం చేయడం చూసినపుడు నేను కూడా జిమ్ కు వెళ్లాల్సిందే, ఖచ్చితంగా చేయాలి. కానీ నేను ఈ విషయంలో బద్దకస్తురాలిని అని ఉపాసన అన్నారు.

  నిహారిక గురించి..

  నిహారిక గురించి..

  నిహారిక సినిమాల్లోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. చాలా స్ట్రాంగ్ అమ్మాయి. తనంటే నాకు చాలా ఇష్టం. సుష్మిత కూడా సినిమా రంగంలోకి వచ్చింది. మామయ్యకు స్టైలింగ్ చేస్తోంది. స్త్రీలు, పురుషులు అని వేరు చేసి చూడటం నాకు ఇష్టం ఉండదు. అంతా సమానంగా పని చేస్తాం. ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. సమానత్వం ఉండాలనేది నా భావన అని ఉపాసన అన్నారు.

  English summary
  Upasana interview Ram Charan and Mega Family. Check out details here.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more