»   » బిజినెస్ ఇండియా కవర్ పేజ్ పై ఉపాసన : మనకు తెలిసిన మెగాకోడలు కాదు

బిజినెస్ ఇండియా కవర్ పేజ్ పై ఉపాసన : మనకు తెలిసిన మెగాకోడలు కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉపాసనా కామినేని ఒక పేరుగా అయితే మనకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య గా మెగా ఇంటి కొడలి గా మాత్రమే తెలుసు. కానీ స్వతహాగా ఒక బిజినెస్స్ ఉమన్ గా ఉపాసన కార్పోరెట్ రంగం లో సాధిస్తున్న విజయాల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఇండియా లోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగజైన్ కవర్ మీద ఉపాసన కు చోటు దక్కింది ఎందుకో తెలుసా

కార్పోరేట్ రంగానికి చెందిన ఉపాసన వేరు

కార్పోరేట్ రంగానికి చెందిన ఉపాసన వేరు

కానీ కార్పోరేట్ రంగానికి చెందిన ఉపాసన వేరు, ఉపాసనా కామినేని అనే యువ వ్యాపార వేత్త ని మనం గుర్తించలేకపోయాం కానీ తాజా బిజినెస్ ఇండియా మ్యాగజైన్ మాత్రం కేవలం మెగా ఇంటి కోడలిగానే కాక ఒక స్వతంత్ర మహిళగా ఉపాసన లోని శక్తి సామర్త్యాలనీ, ఆమె లోని బిజినెస్ మ్యానెజ్ మెంట్ స్కిల్స్ నీ గుర్తించింది., ఆ మ్యాగజైన్ కవర్ పేజ్ పై ఉపాసనకీ చోటు ఇచ్చింది.. ఆ వివరాలు...

బిజినెస్ ఫ్యామిలీ నుంచి

బిజినెస్ ఫ్యామిలీ నుంచి

నిజానికి ఉపాసన బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది.. తల్లి, తండ్రి ఇద్దరి వైపు మెగా మెడికల్ బ్యాక్ గ్రవుండ్ వుంది. అందువల్ల ఆమెకు మంచి మేనేజ్ మెంట్ స్కిల్స్ వున్నాయి. అందుకు ఎక్కడిక్కడ స్టాఫ్ వున్నారు. అయినా వారికి పనులు చెప్పడం, వారి ద్వారా పనులు చేయించడం వంటివి ఉపాసన టేకప్ చేసినట్లు వినికిడి. ముఖ్యంగా చరణ్ కు సంబంధించి ప్రెస్ వ్యవహారాలను ఇప్పుడు ఉపాసనే చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వున్న చరణ్ పీఆర్వోను మార్చింది కూడా ఉపాసన అని టాక్ కూడా వచ్చింది.

పెళ్లైన కొత్తల్లో

పెళ్లైన కొత్తల్లో

నిజానికి రామ్ చరణ్ తో పెళ్లైన కొత్తల్లో ఉపాసన అందంగా లేదంటూ ఆమెని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టు లు చాలానే వచ్చాయి. హీరో రామ్ చరణ్ తేజ్ పక్కన ఉపాసన మరీ తేలిపోయిందన్నట్టు గా వారిరువురి జోడీపై చాలా చర్చలు జరిగాయి. కానీ రామ్ చరణ్ తేజ్ వాటిని పట్టించుకోలేదు ఉపాసన కూడా లైట్ తీసుకుంది.

మీడియాముందుకు వచ్చి

మీడియాముందుకు వచ్చి

ఆమె చాలా బాధపడి ఉండవచ్చు కానీ ఆమె కూడా ఏనాడు బయటపడలేదు. ఎందుకంటే ఆమె అందం ఎక్కడ ఉందో ఆమెకు తెలుసు తన శక్తి సామర్థ్యాల ముందు శారీరక అందం మరీ చిన్నదని ఉపాసనకి తెలుసు. అందుకే ఏనాడూ తాను బయటికి రావాల్సిన సమయం లో తప్పుకోలేదు, ప్రతీ మెగా ఫంక్షన్ లోనూ తాను చరణ్ తో కలిసి కనిపిస్తూనే ఉంది. అవసరం ఉన్నప్పుడు మీడియాముందుకు వచ్చి మాట్లాడింది కూడా

అందరూ నన్ను విమర్శించి ఉంటారు

అందరూ నన్ను విమర్శించి ఉంటారు

"అందంగా ఉండే రామ్ చరణ్ కి ఇంకా అందమైన అమ్మాయిని చేసుకొంటాడని అందరూ అనుకోవడం సహజమే. కానీ అప్పుడు నేను కొంచెం లావుగా ఉన్నందున అందరూ నన్ను విమర్శించి ఉంటారు. అది సహజమే. వాటిని నేను సానుకూలంగానే తీసుకొన్నాను. అందుకే నేడు ఈ రూపంలో మీ ముందున్నాను," అని చెప్పేసింది.

లైఫ్ మేనేజిమెంట్ డైరెక్టర్ గా

లైఫ్ మేనేజిమెంట్ డైరెక్టర్ గా

ఆమె అపోలో గ్రూప్ చైర్మన్ మనుమరాలు కావడంతో ఆసుపత్రిలో లైఫ్ మేనేజిమెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటుంటారు. బీ పాజిటివ్ అనే పత్రికకి ఎడిటర్ గా వ్యహరిస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఎన్నడూ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించేందుకు ప్రయత్నించలేదు.

 విడిపోబోతున్నారని:

విడిపోబోతున్నారని:

ఆ తరువాత వారిరువురు విడిపోబోతున్నారని మీడియాలో ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ అప్పుడు కూడా వారిరువురూ ఆ వార్తలని పట్టించుకోలేదు. అంతే కాదు మీడియాలో తమ డైవోర్స్ గురించి వచ్చిన గాసిప్స్ గురించి కూడా ప్రశ్న ఎదురైనప్పుడు మొహమాటం తోనో, చిరాకు తోనో కాకుండా కూల్ గానే సమాధానం చెప్పింది.

మంచి ఫ్రెండ్స్ :

మంచి ఫ్రెండ్స్ :

"మేమిద్దరం భార్యాభర్తల కంటే మంచి ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. కనుక మా మధ్య అటువంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. రాబోదూ కూడా. ఒకవేళ అటువంటిదేమయినా ఉంటే మేమిద్దరం మీడియాని పిలిచి మరీ చెపుతాము. కనుక ఇకనైనా మాకు బాధ కలిగిస్తున్న అటువంటి పుకార్లని ప్రచారం చేయడం మానుకోమని అందరినీ అభ్యర్దిస్తున్నాను," అంటూ స్పందించిన ఉపాసన బయటి వాళ్ళు అనుకునే ఏ నెగెటివ్ పాయింట్ విషయం లో అయినా తానెంత లైట్ తీస్కుంటానో అన్నట్టు గానే స్పందించింది.

బిజినెస్ ఇండియా మేగజైన్:

బిజినెస్ ఇండియా మేగజైన్:

తాజాగా బిజినెస్ ఇండియా మేగజైన్ కోసం.. అపోలో ఛైర్మన్ డా. సి.ప్రతాప్ రెడ్డి ఫోటోను కవర్ పేజ్ పై వేస్తే.. అదే కవర్ పై ఉపాసనకు కూడా చోటు దక్కింది. అపోలో గ్రూప్ హెడ్ గా ఆయన పేరును.. బిజినెస్ మేగజైన్ కవర్ పేజ్ పై వేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

చోటు దక్కించుకోవడం :

చోటు దక్కించుకోవడం :

కానీ అదే పేజ్ పై కొంచెమే అయినా సరే.. అసలు చోటు దక్కించుకోవడం అంటేనే ఉపాసన రేంజ్ ఎంతగా పెరుగుతోందో అర్ధమవుతోంది. ఇప్పటికే అపోలో లైఫ్ సైన్ను లీడ్ చేస్తున్న ఉపాసన.. సోషల్ మీడియా ద్వారాను.. యాక్టివిటీస్ ద్వారాను హెల్త్ కాపాడుకోవాల్సిన అవసరంపై ప్రచారం చేస్తూ ఉంటుంది.

మేగజైన్ కథనం తో:

మేగజైన్ కథనం తో:

టో ఫిట్నెస్.. వెల్నెస్ గురించి ఈమె చేస్తున్న ప్రచారం గురించి ప్రత్యేకంగా ఈ మేగజైన్ లో ప్రస్తావించారు. మిస్టర్ సి.. చెర్రీ పాటించే ఫిట్నెస్ కూడా కబుర్లను చెబుతూ పాపులర్ అయిన ఉపాసన ఇప్పుడు ఈ మేగజైన్ లో వచ్చిన కథనం తో మరో మెట్టు ఎక్కిందనే చెప్పుకోవాలి.

English summary
Upasana and Her GrandFather on business india magazine Cover Page, and Magazine publishd an article on Upasana
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu