»   » బర్త్ డే స్పెషల్: చిరంజీవికి ఉపాసన ప్రామిస్.... చెర్రీ శిష్యుడే!

బర్త్ డే స్పెషల్: చిరంజీవికి ఉపాసన ప్రామిస్.... చెర్రీ శిష్యుడే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు రేపు పండగరోజు. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అభిమానులకు మాత్రమే కాదు....మెగా కుటుంబ సభ్యులకు కూడా ఇదో స్పెషల్ డే. స్పెషల్ డే సందర్భంగా ఏదైనా స్పెషల్ నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఓ ప్రామిస్ చేశారు.

  మామయ్య చిరంజీవి త‌న‌కు ఇచ్చిన అతిపెద్ద బ‌హుమ‌తి రామ్ చ‌ర‌ణ్ అని, అత‌నితో పాటు కుటుంబాన్నంత‌టినీ ఎల్ల‌వేళ‌లా సంతోషంగా ఉంచ‌డానికి తాను ప్ర‌య‌త్నిస్తానని ప్రామిస్ చేసిన‌ట్లు ఉపాస‌న తెలిపారు.

  ప్రామిస్ నిలుపుకుంటాను

  ప్రామిస్ నిలుపుకుంటాను

  ప్రామిస్‌ను నిలుపుకోవ‌డం ఒక అంద‌మైన బాధ్య‌త అని, చిరంజీవిగారికి తానంటే ఎంతో న‌మ్మ‌క‌మ‌ని, తాను చేసిన ప్ర‌తి ప‌నిని ఆయ‌న పొగడుతార‌ని, ఇంకా బాగా చేయాల‌ని ప్రోత్స‌హిస్తారని ఉపాస‌న చెప్పుకొచ్చారు.

  Chiranjeevi 151 Movie Uyyalawada Narasimha Reddy First Look On August 22nd
  చెర్రీ ఆయనకు శిష్యుడు

  చెర్రీ ఆయనకు శిష్యుడు

  చెర్రీకి వాళ్ల నాన్నంటే ఎంతో ఇష్టం. వాళ్లు తండ్రీ కొడుకుల్లా కాకుండా గురు శిష్యుల్లా ఉంటారని ఉపాసన పేర్కొనడం గమనార్హం. తనను ఇంట్లో ఎంతో గొప్పగా చూసుకుంటారు. ఇలాంటి ఇంట్లోకి రావడం తన అదృష్టమని ఉపాసన తెలిపారు.

  చిరు 150

  చిరు 150

  చిరంజీవి 150వ సినిమా త‌మ కుటుంబ స‌భ్యులంద‌రికీ ఎమోష‌న‌ల్‌గా బాగా క‌నెక్ట‌యిన చిత్ర‌మ‌ని ఉపాసన చెప్పారు. ఈ సినిమా చూసి తామంతా ఎంతో ఎంజాయ్ చేశామని ఉపాసన వెల్లడించారు.

  గతంలో రూమర్స్

  గతంలో రూమర్స్

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.... తన బెస్ట్ ఫ్రెండ్ ఉపాసనను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారి వివాహం జరిగి దాదాపు ఐదేళ్లు పూర్తయింది. ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు. అయితే వీరి వివాహం సమమంలో ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అందుకు కారణం ఉపాసన అప్పట్లో కాస్త లావుగా ఉండటమే. తర్వాత కొన్నాళ్లకు ఉపాసన, రామ్ చరణ్ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తర్వాత రామ్ చరణ్ స్వయంగా వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేవని ఆ వార్తలు కొట్టిపారేసారు.

  మీరు చెర్రీకి సరైన జోడీ కాదనే విమర్శపై

  మీరు చెర్రీకి సరైన జోడీ కాదనే విమర్శపై

  గతంలో ఓ ఇంటర్వ్యూలో...... మీరు చెర్రీకి సరైన జోడీ కాదనే విమర్శపై ఉపాసన స్పందిస్తూ..... నిజమే.... అప్పుడు నేను లావుగా ఉండేదాన్ని. నేను చరణ్ కి సరిజోడికాదు అంటే సంతోష పడే విషయమే.. మా ఆయనకు చాలా మంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. వారంతా తనకు ది బెస్ట్ కావాలని కోరుకుంటున్నారనేగా, ఇది బాగుంది... దీన్ని ఒక పొగడ్తగానే తీసుకుంటా అంటూ ఉపాసన తనదైన రీతిలో స్పందించారు. ఈ మధ్య ఉపాసన ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టి చాలా స్లిమ్ అయిన సంగతి తెలిసిందే.

  విడాకుల వార్తలపై...

  విడాకుల వార్తలపై...

  మేము అందరిలాగే నార్మల్ కపుల్. బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో. అసలు మేము విడాకులు ఎందుకు తీసుకుంటాం. నిజంగా అలా అయితే బయటి ప్రపంచానికి చెప్పుకోగలిగే ధైర్యం ఉన్న మనుషులం. ఎవరేమైనా రాసుకోండి ఇప్పుడయితే దాని గురించి పట్టించుకోను అని ఉపాసన గతంలో ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

  ఇప్పట్లో పిల్లల్ని కనే ఆలోచన లేదు

  ఇప్పట్లో పిల్లల్ని కనే ఆలోచన లేదు

  నా బరువు తగ్గడానికి నేను చాలా సమయం వెచ్చించాను. మల్లీ ఇపుడు కూర్చుని బరువు పెరగదల్చుకోలేదు. మేము ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం. నాకు నిజంగా పిల్లలు కావాలనుకుంటే నా వెనక మొత్తం అపోలో ఉంది. నేను పిల్లల్ని కంటాను. కానీ అది మా వ్యక్తిగతం. అది తర్వాత ఉంటుంది. ఇది ప్రపంచం మొత్తం తెలియాలనుకోను. అది మా పర్సనల్. కొన్ని అలాగే పర్సనల్ గా ఉంచాలి. అలాగే ఉంచుతాను... అంటూ ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశ్యం లేదని చెప్పకనే చెప్పింది ఉపాసన.

  నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి

  నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి

  మామయ్యగారు చాలా మంచి వ్యక్తి. అత్తయ్యగారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. చరణ్, తన కుటుంబం నాకు ఎంతో అండగా నిలిచారు. అందుకే వారికి కృతజ్ఞత తగినంతగా చెప్పుకోవాలి. చరణ్ ఎప్పుడూ నా పక్కనే ఉంటూ తోడుగా ఉంటాడు. తన అసిస్టెంట్, డ్రైవర్... అందరూ కూడా నా గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. తలుచుకుంటే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.

  మామగారి గురించి ఉపాసన

  మామగారి గురించి ఉపాసన

  మామగారు చాలా జాలిగుండె కలిగిన వ్యక్తి. అంత సాధించినా కూడా ఎంతో జాలి కలిగి ఉన్న వ్యక్తి. చాలా మంచి మర్యాద ఉన్న వ్యక్తి. మా ఆయన కూడా అలానే తయారవుతున్నారు. తను చాలా కరుణ చూపించే వ్యక్తి అని ఉపాసన గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

  English summary
  Upasana, the daughter-in-law of Chiranjeevi came up with a unique gift. “Charan is the best guest for me by Mavayya. He has immense respect and love for his father. On the occasion of Mavayya’s Birthday, I promised him to keep Charan and the family happy every time,” Upasana said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more