»   » భార్య ముందు వెరైటీగా చిట్టిబాబు..వైటింగ్ మొదలైంది అంటున్న ఉపాసన, ఎంత క్యూట్ గా ఉన్నారో!

భార్య ముందు వెరైటీగా చిట్టిబాబు..వైటింగ్ మొదలైంది అంటున్న ఉపాసన, ఎంత క్యూట్ గా ఉన్నారో!

Subscribe to Filmibeat Telugu
చిట్టిబాబు మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు....

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం మార్చ్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దర్శకతంలో రూపొందుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న యువకుడిగా ఛాలెంజింగ్ పాత్రని పోషిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే చరణ్ సతీమణి ఉపాసన తాజాగా మరో అప్డేట్ అందించింది. చిట్టిబాబు గెటప్ లో ఉన్న చరణ్ ఫోటోని షేర్ చేసింది.

ఆసక్తి రేపుతున్న రంగస్థలం

ఆసక్తి రేపుతున్న రంగస్థలం

రంగస్థలం చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా రాంచరణ్ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రపై అందరి దృష్టి నెలకొని ఉంది.

ఎలా నటించాడో

ఎలా నటించాడో

వినికిడి లోపం ఉన్న యువకుడిగా రాంచరణ్ ఈ చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నాడు. చరణ్ పల్లెటూరి యువకుడిగా ఎలా నటించాడో అని అభిమానులు సర్వత్రా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

రామలక్ష్మిగా సమంత

రామలక్ష్మిగా సమంత

సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సమంత పాత్ర కోసం ప్రత్యేకంగా టీజర్ విడుదల చేశారనే ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.

క్యూట్ ఫోటో

రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఓ క్యూట్ ఫోటోని షేర్ చేసారు. చిట్టి బాబు లుక్ లో ఉన్న చరణ్.. ఉపాసనతో వెరైటీ స్టైల్ లో నిలబడి ఉన్నాడు. రంగస్థలం చిత్రం మార్చ్ 30 న విడుదల కాబోతున్న విషయాన్ని తెలియజేసిన ఉపాసన.. చిట్టిబాబు మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడంటూ కామెంట్ పెట్టింది.

English summary
Upasana shares cute photo with Ram Charan. She told that Chittibabu waiting for Rangasthalam movie responc.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu