Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఉపాసన...స్లిమ్ అయ్యేందుకు ఇలా! (ఫోటోస్)
హైదరాబాద్: హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైనర్ రమోనా బ్రగాంజా హైదరాబాద్ వాసులకు శిక్షణ ఇచ్చేందుకు సిటీలో ల్యాండ్ అయ్యారు. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలోని అపోలో లైఫ్ ఫిట్‌నెస్ సెంటర్‌లో రమోనా నెల రోజులపాటు శిక్షణ(ఏప్రిల్ 7 వరకు) ఇస్తారు.
ఈ మేరకు ఆమెను నగర వాసులకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో లైఫ్ నిర్వాహకురాలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన మాట్లాడుతూ...‘జెస్సికా అల్బా, హల్లీబెర్రీ, అన్నాహాత్‌వే తదితర హాలీవుడ్ నటులకు శిక్షకురాలిగా రమోనా పేరొందారు. వారందరికీ విజయవంతంగా శిక్షణనిచ్చి... వారి ఫిజిక్‌లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆమె సేవలు హైదరాబాదీలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది. నేను కూడా కొంత కాలంగా రమోనా సూచనలు తీసుకొంటున్నా. ఇకపై ఆమె శిక్షణలో నా ఫిజిక్ మరింతగా మెరుగవుతుందని ఆశిస్తున్నా. మహిళలందరూ స్వయంశక్తితో ఎదగాలని కోరుకుంటూ ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఫిట్‌నెస్ ట్రైనర్లుగా మరింత మంది మహిళలు రావాలనేది నా ఆకాంక్ష' అని చెప్పారు.
స్లైడ్ షోలో ఫోటోలు...

అపోలో లైఫ్
జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఉపాసన, రమోనా పాల్గటొన్నారు.

భారత సంతతి
రామోనా మాట్లాడుతూ‘నా మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. మా పేరెంట్స్ నేను పుట్టక ముందే భారత్ నుంచి కెనడా వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డారు' అని తెలిపారు.

నెల రోజుల పాటు శిక్ష
మూడేళ్ల క్రితం భారత్‌కు వచ్చా. మరోసారి ఇలా రావడం ఆనందంగా ఉంది. సిటీవాసులకూ నెల రోజుల పాటు అందుబాటులో ఉంటాను అని రమోనా తెలిపారు.

ఉపాసన
శిక్షణలో నా ఫిజిక్ మరింతగా మెరుగవుతుందని ఆశిస్తున్నా. మహిళలందరూ స్వయంశక్తితో ఎదగాలని కోరుకుంటూ ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఫిట్‌నెస్ ట్రైనర్లుగా మరింత మంది మహిళలు రావాలనేది నా ఆకాంక్ష' అని చెప్పారు.