twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బుంటే చర్యలు తీసుకోరా? : రామ్ చరణ్ భార్య ఉపాసన సంచలనం

    By Bojja Kumar
    |

    హైదారాబాద్: ఇటీవల ప్రమాద వశాత్తు మరణించిన ఇంజనీరింగ్‌ థర్డ్ ఇయర్ విద్యార్థిని దేవి(21) మరణం మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. ఇపుడు హైదరాబాద్ లో ఈ ఇష్యూ హాట్ టాపిక్. ఆమెను హత్యచేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నారని బంధువులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

    ఈ సంఘటనపై రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా స్పందించారు. 'మరో భారతీయ బిడ్డ తన జీవితాన్ని కోల్పోయింది. అయినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అతడు ధనవంతుడు...పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈ కేసులో నిందుతులు తప్పించుకోకుండా అంతా కలిసి పోరాడుదాం..న్యాయం జరిగేలా చేద్దాం. ఈ విషయం గవర్నమెంటు అఫీషియల్స్ కు చేరే వరకు, నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకునే వరకు ఈ పోస్టును షేర్ చేద్దాం' అంటూ ఊపాసన తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.

    దేవిని కారులోనే హతమార్చి రోడ్డు ప్రమాదంగా డ్రామా ఆడుతున్నారని బంధువులు, తోటి విద్యార్థులు ఆరోపింస్తున్నారు. కారు ఢీకొన్నట్టుగా చెబుతున్న చెట్టు వద్ద గాజుపెంకులు చల్లి, చెట్టును చెక్కి ప్రమాదమనే భ్రమ కల్పిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మద్యం మత్తులో వాహనం నడపటం వల్లనే ప్రమాదం జరిగిందని, అతడి శరీరంలో ఆల్కహాల్‌ లేదంటూ పోలీసు అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పోస్టుమార్టం నివేదికను కూడా తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

    ఆదివారం అర్ధరాత్రి దాటాక కారులో ఓ అబ్బాయి, అమ్మాయి పెద్దగా మాట్లాడుకున్నారు. అది కాస్తా గొడవగా మారింది. అంతలో ఆ అమ్మాయి కారులో నుంచి బయటకు దిగింది. అంతలో ఓ యువకుడు ఆమెను కారులోకి లాగాడు. రక్షించమంటూ పెద్దగా కేకలు వేసింది. నేను భయపడి అక్కడకు వెళ్లలేకపోయాను. చీకటిగా ఉండటంతో కారు వద్దకు వెళ్లేందుకు ధైర్యం చేయలేకపోయా. కొద్దిసేపటికే వేగంగా వెళ్లిన కారు చెట్టును ఢీకొట్టింది అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

    English summary
    "Another Indian daughter lost her life and there is no action taken on the culprit only because he is rich enough to have connections. Let us all come together and show him that he cannot escape from the truth and justice. Keep sharing this post as much as possible till it compels the govt officials to take a strict action on the culprit whoever he is." Upasna Kamineni said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X