twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైటిల్ గా చేతి సంజ్ఞ ఎందుకు పెట్టానంటే..ఉపేంద్ర

    By Srikanya
    |

    ఉపేంద్ర తాజా చిత్రానికి టైటిల్ గా ఓ పేరుని కాక కేవలం చేతి సంజ్ఞ ని పెట్టారు. దానికి వివరణ ఇస్తూ ఉపేంద్ర..పేరు లేకుండా చేతి గుర్తుతో విడుదల చేయ్యడం ఈ సినిమా స్పెషాలిటీ. మాటల్లో చెప్పే కథ కాదు. చేతల్లో చెయ్యాలని చెప్పేది. అందుకే చేతి గుర్తుని టైటిల్‌గా ఉపయోగించాం అన్నారు. రాక్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రానికి ఉపేంద్ర హీరోగానే కాకుండా దర్శకుడుగా కూడా చేసారు.నయనతార హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది.కన్నడంలో ఘన విజయం సాధించిన చిత్రానికి ఇది రీమేక్.

    ఇక గ్యాప్ తర్వాత సినిమా డైరక్ట్ చేయటం గురించి మాట్లాడుతూ... "మళ్లీ డైరెక్షన్ ఎందుకు చెయ్యడం లేదని చాలామంది అడుగుతూ ఉండేవాళ్లు. ఆ టెన్షన్‌లో చేసిందే ఈ సినిమా . పట్టుదలతో చేయడం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఇది హిట్టవడంతో మళ్లీ నాకు ధైర్యం వచ్చింది. కన్నడంలో స్క్రీన్‌ప్లే గురించి బాగా చెప్పుకున్నారు. తెలుగులోనూ దానికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటివరకు 35 సినిమాలు చేశా. నటుణ్ణయి 21 సంవత్సరాలయ్యింది. డైరెక్టర్‌గా ఇది ఏడవ సినిమా అన్నారు ఉపేంద్ర.

    English summary
    Subash Chandra Gandhi (Upendra) is an NRI, who owns a multi-billion pounds software company in London. He is a big patriot, who loves India despite being in London. His love for India makes him fall to a girl called Indra (Nayantara), who acts like a tradition Indian girl. But her revenge mission makes him realise the dirty political system of India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X