»   » ఊర్మిళ కు పెళ్లైంది, పదేళ్లు తేడా.. ఫొటోలతో, పూర్తి డిటేల్స్

ఊర్మిళ కు పెళ్లైంది, పదేళ్లు తేడా.. ఫొటోలతో, పూర్తి డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఎవరికీ చెప్పాపెట్టాకుండా పెళ్లి చేసుకున్న ప్రీతి జింతా గురించి మాట్లాడుకుంటూండగానే ...ఇంకో హీరోయిన్ కు కూడా పెళ్లి చేసేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా నిన్న (గురువారం, మార్చి 3, 2016) ఊర్మిళ వివాహం చేసేసుకుంది. ఎక్కడా చిన్న రూమర్ కానీ వార్త కానీ మనం విని ఉండలేదు ఈ విషయమై. అంత జాగ్రత్తగా పర్శనల్ లైఫ్ ని మెయింటైన్ చేస్తూ వచ్చి అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు,సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది.

రంగీలా, సత్య, అనగనగా ఒక రోజు, గాయం చిత్రాలతో తెలుగు,హిందీ భాషల్లో తనకంటూ ఓ స్దానం ఏర్పాటు చేసుకున్న ఈ మరాఠి బ్యూటి ఇలా బ్రహ్మచారిణిగానే ఉండిపోతుందని చాలామంది భావించారు. అయితే వారి అంచనాలను తలక్రిందలు చేసింది. గత కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్న మేసిన్ అక్తర్ మిర్ ని వివాహం చేసుకుంది.

ఇంతకీ ఈ పెళ్లి కొడుకు ఎవరూ అంటారా..గతంలో మోడల్ గా చేసి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా సెటిలైన్ వ్యక్తి. కాస్త లేటైనా ఓ ఇంటిది అయ్యింది. ఆమె టాలీవుడ్ నుంచి కానీ, బాలీవుడ్ నుంచి కానీ ఎవరినీ వివాహానికి పిలవలేదని చెప్పింది.

ఊర్మిళ మాట్లాడుతూ.. "మా రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని చాలా సింపుల్ గా జరపాలని నిర్ణయించుకోవటంతో మేం ఇలా ప్రెవేట్ వ్యవహారంగ ఈ వివాహం చేసుకున్నాం. మీ అందరి ఆశీస్సలు మా ఈ కొత్త ప్రయాణానికి అవసరం ," అని ఆమె వివాహానంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.

స్లైడ్ షోలో ... ఆమె భర్త గురించి విశేషాలు..

మిస్టర్ ఇండియా

మిస్టర్ ఇండియా

ఈ పెళ్లి కొడుకు టైమ్స్ ఆఫ్ ఇండియావారి మిస్టర్ ఇండియా 2007 లో సెకండ్ రన్నర్ అప్.

లీడ్ రోల్

లీడ్ రోల్

అతను ఎ మెన్స్ వరల్డ్ అనే సినిమాలో సెక్స్ వర్కర్ లీడ్ రోల్ చేసాడు.

కాశ్మీర్ కు చెందిన

కాశ్మీర్ కు చెందిన

మోడల్ అవ్వాలని కాశ్మీర్ లో సొంత ఇంటిని వదిలేసి వచ్చాడు. ఎందుకంటే ఆ సమయంలో అతనికి ఇంట్లో సంభంధాలు చూస్తున్నారు. కెరీర్ లో సెటిల్ అవ్వాలనే అతను ఇలా వచ్చేసాడు

రెండో చిత్రం

అతని రెండో చిత్రం ముంబై మస్త్ కలందర్. 2011 లో రిలీజైంది.

లక్కీ బై ఛాన్స్

బాలీవుడ్ లో మంచి పేరు వచ్చిన లక్కీ బై ఛాన్స్ అనే చిత్రంలో కునాల్ అనే పాత్ర చేసాడు

ఇన్ హౌస్ మోడల్

ఇన్ హౌస్ మోడల్

ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు ఇన్ హౌస్ మోడల్ ఇతనే

ర్యాంప్ వాక్

ర్యాంప్ వాక్

అతను మనీష్ మల్హోత్రా, తరుణ్ కుమార్, విక్రమ్ పండాస్, రానా గిల్ వంటి డిజైనర్స్ కోసం ర్యాంప్ వాక్ చేసాడు

చిన్న వయస్సు

చిన్న వయస్సు

ఇతని వయస్సు 32 లేదా 33 ఉంటుంది. ఊర్మిళ కన్నా చిన్న వయస్సు

ఎఆర్ రహమాన్ వీడియో

ఎఆర్ రహమాన్ రూపొందించిన ఈ వీడియోలోనూ అతన్ని చూడవచ్చు.

ఫ్యాషన్ షో లో

ఫ్యాషన్ షో లో

ఓ ఫ్యాషన్ షో కు వెళ్లిన ఊర్మిళతో అయిన పరిచయం, ప్రేమగా మారింది

ప్రపోజల్

ప్రపోజల్

మోషిన్ మొదట ఆమెకు ప్రపోజ్ చేసాడని, ఆమె మొదట ఒప్పుకోలేదని చెప్తున్నారు

మోడలింగ్ కు స్వస్ది

మోడలింగ్ కు స్వస్ది

మెల్లిగా మోడలింగ్ నుంచి తప్పుకుని బిజినెస్ మ్యాన్ గా సెటిలయ్యాడు

మనీష్ ద్వారానే

మనీష్ ద్వారానే

ప్రముఖ డిజైనర్ ..మనీష్ మల్హోత్రా ద్వారానే ఊర్మిళకు మేషిన్ అక్తర్ ..పరిచయం జరిగింది

వర్మ విషెష్

వర్మ విషెష్

రంగీలాతోనే

రంగీలాతోనే

ఊర్మిళ ఎన్ని చిత్రాలు చేసినా రంగీళాతోనే ఆమెకు పేరు వచ్చింది. అది ఆమె ఇంటి పేరులా స్దిరపడిపోయింది

చిన్నప్పుడే

చిన్నప్పుడే

బాలనటిగా చిత్రసీమలోకి ప్రవేశించిన ఊర్మిళ మటోంద్కర్ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ భాషల్లో కథానాయికగా తన ప్రతిభ చాటుకుంది.

తెలుగులో

తెలుగులో

'అంతం' 'మనీ మనీ' 'అనగనగా ఒకరోజు'... ఇలా ఆమె కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.

పింజార్ లో ..

పింజార్ లో ..

గ్లామర్ పాత్రలే కాదు నాన్‌గ్లామర్ పాత్రలను పండించడంలో కూడా ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది. 'పింజార్' సినిమాలో హమిదా పాత్రలో ఆమె నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి.

అవుట్ డేటెడ్

అవుట్ డేటెడ్

విక్రమ్ భట్ 'స్పీడ్' తరువాత మాత్రం ఆమె కెరీర్ స్పీడ్ పూర్తిగా తగ్గిపోయింది.

మళ్లీ

మళ్లీ

ఫరాఖాన్ 'ఓమ్ శాంతి ఓం'లో ఒక పాటలో కనిపించింది. ఆ తరువాత ఊర్మిళను ప్రత్యేకంగా గుర్తుంచుకునే సందర్భం, సినిమా ఏదీ రాలేదు.

టీవీషోలలో

టీవీషోలలో

ఊర్మిళ కలర్స్ ఛానెల్ లో చక్ ధూమ్ ధూమ్ అనే డాన్స్ రియీలిటీ షోకి జడ్డిగా , వార్ పరివార్ అనే రియాలటీ షో కు హోస్ట్ గా వ్యవరించింది.

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

వన్ ఇండియా తెలుగు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియచేస్తోంది

English summary
Urmila Mantondkar tied the knot with Mohsin Akhtar Mir on Thursday (March 3, 2016). It was low-key wedding ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu