22ఏళ్ళ పాప్ సింగర్ హత్య:ఆటోగ్రాఫ్ ఇస్తూండగానే కాల్చేసాడు
అమెరికాలోని ఓర్లాండోలో పాప్ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీ(22) దారుణ హత్యకు గురైంది. యూట్యూబ్ స్టార్ గా, అమెరికన్ పాప్ సింగర్ గా పేరుపొందిన ఆమెపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. టీవీ షో 'బి ఫోర్ యు ఎగ్జిట్' ప్రదర్శన ముగిశాక ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. ఆమె అభిమానులతో ముచ్చటిస్తూ వారికి ఆటోగ్రాఫ్ ఇస్తోన్న సమయంలో ఓ దుండగుడు ఆమెపై కాల్పులు జరిపి, అనంతరం తనని తాను కాల్చుకొని చనిపోయాడు.
దాడిలో గాయపడ్డ గాయని క్రిస్టీనా మృతిచెందినట్లు ఒర్లాండో పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గాయని సోదరుడు సాయుధున్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కొంత సేపు వాళ్ల మధ్య పెనుగులాట జరిగింది. ఆ తర్వాత సాయుధుడు తనను తాను కాల్చుకున్నాడు. గన్‌తో దాడి చేసింది ఎవరన్నది ఇంకా పోలీసులు గుర్తుపట్టలేదు. ఆ వ్యక్తి ఎందు కోసం కాల్పులకు దిగాడో కూడా ఇంకా తెలియరాలేదు.

ద వాయిస్ పాటల పోటీల సిరీస్‌లో సింగర్ క్రిస్టీనా ఒకసారి మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆమెకు యూట్యూబ్‌లో అభిమానులు విపరీతంగా పెరిగారు. ఆమె వీడియోలకు లక్షల సంఖ్యలో హిట్లు కూడా వచ్చాయి. చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న క్రిస్టినా..ఇంత ధారుణం గా మరణించతం అంతర్జాతీయ సంగీతాభిమానులను విచారనికి గురిచేస్తోంది...


Click it and Unblock the Notifications











