»   » ‘ఉత్తమ విలన్’ సౌండ్ మిక్సర్‌కు ఆస్కార్ అవార్డు

‘ఉత్తమ విలన్’ సౌండ్ మిక్సర్‌కు ఆస్కార్ అవార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్వరలో విడుదల కాబోతున్న కమల్ హాసన్ మూవీ ‘ఉత్తమ విలన్' చిత్రానికి సౌండ్ మిక్సింగ్ టెక్నీషియన్‌గా పని చేసిన క్రేగ్ మాన్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. హాలీవుడ్ మూవీ 'Whiplash' చిత్రానికిగాను ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. ఈ చిత్రానకి పని చేసని క్రేగ్ మాన్, బెన్ విల్కిన్, థామస్ కుర్లే ఈ అవార్డు షేర్ చేసుకున్నారు.

హాలీవుడ్ చిత్రాలైన ‘ది బోర్నె అల్టిమేటమ్', ‘ఇన్ సైడియస్: చాప్టర్ 2', ‘కేప్టెన్ అమెరికా' చిత్రాలకు క్రేగ్ మాన్ పని చేసారు. అతని టాలెంట్ చూసిన కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్' చిత్రానికి అతని సమక్షంలోనే రీరికార్డింగ్ చేయిస్తున్నారు. అమెరికాలోని పారామౌంట్ స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన రీరికార్డింగ్ జరిగింది.

‘Uthama Villain’ sound mixer wins an Oscar

ఉత్తమ విలన్ సినిమా విషయానికొస్తే...
తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానున్న ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మార్చి 1న ఆడియో విడుదల చేసి, ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కమల్ హాసన్ ఈ చిత్రంలో రంగస్థల కళాకారుడిగా, సినీ నటుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకే పరిమితం కాకుండా...స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా రాసారట. ఇందులో ఆయన పోషించిన ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం.

English summary
Craig Mann, the sound mixer of Kamal Haasan’s upcoming film ‘Uthama Villain’, has won the prestigious Oscar Award at 87th Academy Awards. She shared this coveted award along with Ben Wilkins and Thomas Curley for the Best Sound Mixing category for the film ‘Whiplash’.
Please Wait while comments are loading...