»   »  ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్....

‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ త్వరలో ‘ఉత్తమ విలన్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం తెలుగు, తమిళం రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 10న ఈ సినిమా తెలుగులో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేం ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తమిళ వెర్షన్ ఆడియో ఇప్పటికే విడుదలైంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో తెలుగు వెర్షన్ ఆడియో కూడా విడుదల కానుంది. తెలుగులో చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Uttama Villain Telugu release date

తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానున్న ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కమల్ హాసన్ ఈ చిత్రంలో రంగస్థల కళాకారుడిగా, సినీ నటుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకే పరిమితం కాకుండా...స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా రాసారట. ఇందులో ఆయన పోషించిన ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం.

English summary
The post production work of Kamal Haasan's upvoming film Uttama Villain is in full swing currently and the makers are planning to release both the Telugu and Tamil versions on April 10th.
Please Wait while comments are loading...