For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నైటీలు ధరించి బయటికొస్తారా?? నన్ను విలన్ ని చేస్తారు: ఉత్తేజ్

  |

  రామ్ గోపాల్ వర్మ 'శివ' మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఉత్తేజ్, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , కమెడియన్ గా వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..అంతే కాదు పలు చిత్రాలకు రచయితగా కూడా పనిచేసి తనలోని రచయితను బయటకు తీసుకొచ్చి శభాష్ అనిపించుకున్నాడు..కొత్త వారి రాక తో ఉత్తేజ్ కు అవకాశాలు రాకుండా పోయాయి..అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆడవారి నైటీల ఫై కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు..'

  ఆడవారి వస్త్రధారణగురించి మాట్లాడుతూ .. 'కొంతమంది రాత్రిపూట ధరించే నైటీలతోనే మార్కెట్‌కి వచ్చేస్తారని, అదే నైటీతో బైక్‌లను కూడా డ్రైవ్ చేస్తున్నారని బయటకు వచ్చేది అలాగేనా అని ప్రశ్నించారు. వీరు ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటారు కాని వారి పిల్లలు ఫోన్ పట్టుకోకూడదంటే ఇదెక్కడి న్యాయం అన్నారు. ప్రస్తుతం పిల్లలకు సరైన సోషల్ ఎడ్యుకేషన్ అందటం లేదని, అందువల్ల చుట్టూ ఉన్న రకరకాల ఎడ్యుకేషన్స్ చూసి నేర్చుకుంటున్నారని, పిల్లలకు నూటికి నూరు మార్కులు వచ్చినంత మాత్రాన ఏం ఉపయోగం ఉంటుందని వారికి సమాజం పట్ల అవగాహన చాలా అవసరం అని, ఇలా చెబితే నన్ను అందరూ విలన్‌లా చూస్తారని' పేర్కొన్నారు.

   Uttej comments on ladies nighty dress

  అతను హాస్యాన్ని అద్బుతంగా పండించగలడు, అంతకు మించి రచయితగా పంచ్ లు విసరగలడు. ఆయన మాటలు మామూలుగానే ఉంటాయి, కానీ ఒక్కసారి ఏమోషన్ మోడ్ లోకి వెలితే చాలు.... మన చేతి వెంట్రుకలు లేచి నిలబడాల్సిందే.. గుండెల్లో ఏదో తెలియని ఉద్వేగం... కళ్ళలో ఏదో బాధ తాలూకు భయం, ఒంట్లో వణుకు.. మెదడు లో ఎన్నో ఆలోచనలు బయలుదేరుతాయి. ఇలా యువతలో ఉత్తేజాన్ని నింపగలడు ఉత్తేజ్. ఇదివరలో కూడా ఉత్తేజ్ ఒక కవితలా భారతీయుల మీద వేసిన సెటైర్ కూడా బాగా వైరల్ అయ్యింది.. ఎవరో తంతే పిల్లలు పుడతారట తన్నించుకుంటాం... పిల్లల్ని కిడ్నాప్ చేస్తాం, అమ్మాయిల్ని అమ్మేస్తాం, అబ్రాడ్ ఉద్యోగాలతో అబ్బాయిల్ని ముంచుతాం.. మనిషి ని చంపేశాక శవం బరువని ముక్కలుముక్కలుగా కోసి ఈజీగా విసిరేస్తాం. అమ్మకడుపునుంటే షార్ట్ కట్ గా బయటికి వచ్చేశాం... అన్నింటికీ షాట్ కట్ అంటూ అదరగొట్టాడు ఉత్తేజ్.

  English summary
  Telugu actor and writer Uttej comented on ladeas nightys
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X